Share News

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Mar 31 , 2024 | 08:02 AM

IPL 2024లో ఆదివారం (మార్చి 31) రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలిచి రెండో గెలుపుపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: నేడు మధ్యాహ్నం GT vs SRH మ్యాచ్.. విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్‌లో నేడు (మార్చి 31) డబుల్ మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 2 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. మరోవైపు హైదరాబాద్‌కు కూడా రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో నాలుగో స్థానంలో ఉంది.

టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌(MI)పై గుజరాత్ టైటాన్స్(GT) 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చేతిలో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తన రెండో మ్యాచ్‌లో ముంబైని ఓడించింది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్‌(KKR)తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే రెండు జట్లు కూడా ఒక మ్యాచ్ గెలువగా, ఇప్పుడు రెండో గెలుపు సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రెండు జట్లలో కూడా మంచి ఆటగాళ్లు ఉన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: బోపన్న జోడీదే మియామీ టైటిల్‌


గుజరాత్ టైటాన్స్(GT), సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) మధ్య ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2, హైదరాబాద్ 1 గెలిచాయి. SRHపై GT అత్యధిక స్కోరు 199 పరుగులు. కాగా గుజరాత్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 195 పరుగులు. ఇక గూగుల్ అంచనా ప్రకారం ఈ మ్యాచులో ఇరు జట్లు కూడా 50 శాతం గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలంగా ఉంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఫాస్ట్ బౌలర్లకు పేస్, బౌన్స్ ఉంటాయన్నారు. స్పిన్నర్లకు కూడా సపోర్ట్ లభిస్తుందని వెల్లడించారు.

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టులో శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రహుత్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ కలరు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: మయాంక్‌ మలుపు తిప్పాడు

Updated Date - Mar 31 , 2024 | 08:03 AM