Jasprit Bumrah: కపిల్ దేవ్ రికార్డ్ చిత్తు చేసిన బుమ్రా.. మరో ఘనత కూడా..
ABN , Publish Date - Dec 29 , 2024 | 09:28 AM
ఆసీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచులో జస్ప్రీత్ బుమ్రా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 200 టెస్ట్ వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఈ ఘనత కేవలం 49 టెస్టుల్లో సాధించడం విశేషం. దీంతోపాటు ఇంకో ఘనత కూడా సాధించాడు.
IND vs AUS 4వ టెస్టు 4వ రోజు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) సరికొత్త ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన బుమ్రా, అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా కేవలం 49 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు 50 టెస్టు మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన గొప్ప బౌలర్ కపిల్ దేవ్ పేరిట ఉంది. బుమ్రా సాధించిన ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ నాలుగో మ్యాచ్‌లో బుమ్రా 3 వికెట్లు తీశాడు.
ఆస్ట్రేలియాపై ప్రదర్శన
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో బుమ్రా తన అదిరిపోయే బౌలింగ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్లను ఇబ్బందుల్లో పడేశాడు. ఈ క్రమంలో మ్యాచ్ ప్రారంభ సెషన్‌లోనే రెండు కీలకమైన వికెట్లు పడగొట్టి టీమ్ ఇండియాను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన వెంటనే, ఇది ఆయన టెస్ట్ కెరీర్‌లో 200వ వికెట్ తీయగా, టెస్ట్ క్రికెట్ చరిత్రలో తక్కువ సగటుతో 200 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా కూడా బుమ్రా నిలిచాడు.
ఈ రికార్డులు కూడా..
మ్యాచ్‌ల పరంగా 200 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా భారతదేశం తరపున రెండో ఫాస్టెస్ట్ బౌలర్ అని చెప్పవచ్చు. కానీ బాల్ పరంగా ఆయనకు ఏ భారతీయ బౌలర్ సాటి రాడని చెప్పవచ్చు. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లోనే 200 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. 8484వ బంతికి బుమ్రా తన 200వ టెస్టు వికెట్‌ని సాధించాడు. మహ్మద్ షమీ 9896వ బంతికి 200వ వికెట్ తీసుకున్నాడు. అంతేకాదు బుమ్రా తన 200వ టెస్ట్ వికెట్ తీసుకున్నప్పుడు, ఆయన బౌలింగ్ సగటు 19.56 మాత్రమే కావడం విశేషం. ఈ విషయంలో టెస్టు క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసినప్పుడు ఈ బౌలింగ్ సగటు 20.34గా ఉన్న జయోల్ గార్నర్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.
టెస్టుల్లో అత్యల్ప సగటుతో 200 వికెట్లు పూర్తి చేసిన బౌలర్లు
జస్ప్రీత్ బుమ్రా - 19.56 సగటు
జాయోల్ గార్నర్ - 20.34 సగటు
షాన్ పొల్లాక్ - 20.39 సగటు
వకార్ యూనిస్ - 20.61 సగటు
ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ బంతుల్లో 200 టెస్టు వికెట్లు తీసిన ఆటగాళ్లు
వకార్ యూనిస్ - 7725
డేల్ స్టెయిన్ - 7848
కగిసో రబడ - 8154
జస్ప్రీత్ బుమ్రా - 8484
మాల్కం మార్షల్ - 9234
ఇవి కూడా చదవండి:
Plane Crash: కొరియా విమాన ప్రమాదానికి కారణం అదేనా.. వీరు మాత్రం సేఫ్..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More International News and Latest Telugu News