IPL Prizemoney: ``జట్టు మొత్తం సంపాదన నీ జీతం కంటే తక్కువేగా అన్నాడు``.. ఐపీఎల్ ప్రైజ్‌మనీపై స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:40 PM
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్‌గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్‌కు దక్కిన ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు అట.
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ (IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్‌గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్‌కు దక్కిన ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు అట. అయితే కేకేఆర్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ ఒక్క సీజన్‌కు గానూ అందుకున్న జీతం రూ.24.75 కోట్లు. ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్ జీతం (Mitchell Starc Salary) గురించి ఓ టీమ్‌మేట్ కామెంట్ చేశాడట.
గతేడాది జరిగిన మినీ వేలంలో స్టార్క్‌ను కేకేఆర్ టీమ్ ఏకంగా రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. అంత భారీ మొత్తం వెచ్చించి దక్కించుకున్న స్టార్క్ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేశాడు. వికెట్లు తీయలేక, పరుగులు నియంత్రించ లేక ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతడి జీతంపై నెట్టింట జోకులు మొదలయ్యాయి. విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కేకేఆర్ టీమ్ నాకౌట్ దశకు చేరిన తర్వాత స్టార్క్ తన సత్తా చాటాడు. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత కూడా స్టార్క్ జీతంపై జోకులు ఆగలేదట. ఈ విషయాన్ని తాజాగా స్టార్క్ వెల్లడించాడు.
``ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ సమయానికి ముందు టీమ్‌మేట్స్ అందరం సరదాగా మాట్లాడుకున్నాం. ఛాంపియన్‌గా నిలిచిన మా జట్టుకు లభించిన రూ.20 కోట్ల చెక్‌ను యువ ఆటగాడు రఘువంశీ చూశాడు. ఆ చెక్ చూసిన రఘవంశీ.. ``హుమ్.. నీకు ఇచ్చిన జీతం కంటే తక్కువేగా`` అన్నాడు`` అంటూ అప్పటి సంగతులను స్టార్క్ గుర్తు చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
Jhulan Goswami: నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఒక కొత్త మెంటార్‌గా భారతీయ లెజెండ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..