Share News

MS Dhoni: ``శ్రీశాంత్‌ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు``.. ధోనీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించిన అశ్విన్!

ABN , Publish Date - Jul 13 , 2024 | 10:03 AM

మహేంద్ర సింగ్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అతడి ప్రశాంతత. ఒత్తిడి సమయాల్లో కూడా కూల్‌గా ఉండి జట్టును విజయ తీరాలకు చేరుస్తాడనే కారణంతో అతడిని అందరూ ``మిస్టర్ కూల్`` అని పిలుస్తుంటారు. అలాంటి ధోనీకి కోపం గనుక వస్తే తీవ్ర స్థాయిలో ఉంటుందట.

MS Dhoni: ``శ్రీశాంత్‌ను ఇంటికి వెళ్లిపొమ్మన్నాడు``.. ధోనీ కోపం ఏ స్థాయిలో ఉంటుందో వెల్లడించిన అశ్విన్!
MS Dhoni

మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అనగానే అందరికీ గుర్తుకొచ్చేది అతడి ప్రశాంతత. ఒత్తిడి సమయాల్లో కూడా కూల్‌గా ఉండి జట్టును విజయ తీరాలకు చేరుస్తాడనే కారణంతో అతడిని అందరూ ``మిస్టర్ కూల్`` అని పిలుస్తుంటారు. అలాంటి ధోనీకి కోపం గనుక వస్తే తీవ్ర స్థాయిలో ఉంటుందట. ``ఐ హ్యావ్ ది స్ట్రీట్స్: ఏ కుట్టీ క్రికెట్ స్టోరీ`` పేరుతో క్రికెటర్ అశ్విన్ (R Ashwin) ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో అశ్విన్ పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించాడు. 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఘటన చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తోంది.


``పోర్ట్ ఎలిజబెత్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరుగుతోంది. నేను, శ్రీశాంత్ (Sreesanth) రిజర్వ్ ఆటగాళ్లం. మైదానంలో ఉన్న ధోనీకి తరచుగా నేనే నీళ్లు తీసుకెళ్లి అందిస్తున్నా. దాంతో శ్రీశాంత్ ఏం చేస్తున్నాడని ధోనీ అడిగాడు. పైన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నాడని చెప్పా. కిందకు వచ్చి రిజర్వ్ ఆటగాళ్లతో కూర్చోమని శ్రీశాంత్‌కు చెప్పు అన్నాడు. నేను ఆ విషయం శ్రీశాంత్‌కు చెప్పా. కానీ, శ్రీశాంత్ పట్టించుకోలేదు. తర్వాత మరోసారి ధోనీకి హెల్మెట్ ఇవ్వడానికి వెళ్లా. శ్రీశాంత్ ఏం చేస్తున్నాడని ధోనీ మళ్లీ అడిగాడు. పైన మసాజ్ చేయించుకుంటున్నాడని చెప్పా.``


``తర్వాతి ఓవర్లో హెల్మెట్ తిరిగి ఇవ్వడానికి మళ్లీ నన్ను పిలిచాడు. హెల్మెట్ ఇస్తూ.. ``శ్రీశాంత్‌ను భారత్‌కు పంపించేందుకు విమానం టికెట్ బుక్ చేయమని మేనేజర్‌కు చెప్పు`` అని ధోనీ నాతో అన్నాడు. ఆ విషయం చెప్పిన వెంటనే శ్రీశాంత్ బట్టలు వేసుకుని కిందకు వచ్చాడు. ఆ తర్వాత ధోనీ ఎప్పుడు అడిగినా మైదానంలోకి డ్రింక్స్, నీళ్లు తీసుకెళ్లి ఇచ్చేవాడు`` అని ఆ పుస్తకంలో అశ్విన్ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: ఆ ఫొటో కోసం రోహిత్‌ను కోహ్లీ ఎలా బతిమాలుతున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!


Pakistan: కోహ్లీ పాకిస్తాన్ వస్తే.. భారత్‌ను మర్చిపోతాడు.. పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రీది ఆసక్తికర వ్యాఖ్యలు!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 13 , 2024 | 11:27 AM