MS Dhoni: అదే ధోనీ స్ట్రాటజీ.. అప్పుడే రిటైర్ అవుతాడు.. బౌలర్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jul 21 , 2024 | 03:36 PM
టీమిండియాకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా టీ20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో వైదొలిగిన ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్నాడు. ప్రతి ఏడాది ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
టీమిండియాకు నాయకత్వం వహించిన గొప్ప కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఒకడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా టీ20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీలను సాధించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో వైదొలిగిన ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ (IPL) ఆడుతున్నాడు. ప్రతి ఏడాది ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ధోనీ సమాధానం ఇవ్వకుండా మైదానంలోకి దిగుతూనే ఉన్నాయి. ధోనీ ఎక్కడ ఆడినా అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు (Dhoni Retirement).
అసలు, రిటైర్మెంట్ గురించి ధోనీ మనసులోని మాట ఏమిటి? రిటైర్మెంట్ గురించి ధోనీ ఎలా ఆలోచిస్తాడో తాజాగా బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami) బయటపెట్టాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన షమీ.. ధోనీ రిటైర్మెంట్ స్ట్రాటజీ గురించి వెల్లడించాడు. ``మీరంతా ధోనీని రిటైర్మెంట్ గురించి అడుగుతుంటారు. అతడు ``చూద్దాం లే`` అని కొట్టిపారేస్తుంటాడు. నేను కూడా ఓ సారి ధోనీని రిటైర్మెంట్ గురించి అడిగాను. ఒక అటగాడు ఎప్పుడు రిటైర్ కావాలి అని అడిగా. రెండు కారణాలు ఉన్నప్పుడు ఆట నుంచి రిటైర్ కావచ్చని ధోనీ చెప్పాడంటూ`` షమీ చెప్పుకొచ్చాడు.
````మొదటిది.. మీరు ఆటపై విసుగు చెందినపుడు, రెండు.. జట్టు నుంచి మిమ్మల్ని తొలగించబోతున్నారని తెలిసినపుడు`` అని ధోనీ నాకు చెప్పాడు. ఎప్పుడైతే మీరు ఆటను ఎంజాయ్ చేయలేరో అప్పుడు రిటైర్ కావడం మంచిది. మీ శరీరం నుంచి మీకు సంకేతాలు అందుతాయి. శరీరం నుంచి సహకారం తగ్గినపుడు కచ్చితంగా ఆట నుంచి వైదొలగాల్సిందేన``ని షమీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి..
Hardik Pandya: నటాషాతో విడాకులు.. ఇప్పుడు అనన్యతో..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..