Share News

PCB: పాకిస్థాన్ క్రికెటర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్..

ABN , Publish Date - Oct 04 , 2024 | 11:20 AM

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తుండటం, ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది.

PCB: పాకిస్థాన్ క్రికెటర్లకు నాలుగు నెలలుగా జీతాల్లేవ్..

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు కెప్టెన్సీలో తరచూ మార్పులు చేస్తుండటం, ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి జాతీయ జట్టు ఆటగాళ్లకు నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదు. పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి ఉంది. మొత్తం 25 మంది సీనియర్ పురుషుల క్రికెటర్లకు జులై 1, 2023 నుంచి జూన్ 30, 2026 వరకు మూడేళ్లపాటు కాంట్రాక్టులు లభించాయి. అయితే జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కాంట్రాక్టులపై సమీక్ష జరిగినట్లు పాక్ మీడియా నివేదించింది.


"గత ఏడాది ప్రపంచ కప్‌కు ముందు తమకు అనుకూలమైన కాంట్రాక్ట్‌ను పొందాలని ఆటగాళ్లు బోర్డుపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. జులై నుండి అక్టోబర్ వరకు నాలుగు నెలల పాటు నెలవారీ జీతాలు అందలేదు. జీతాలెప్పుడు పడతాయా అని క్రికెటర్లు వేచి చూస్తున్నారు. ఇప్పటికే బోర్డు దృష్టికి సమస్యను తీసుకెళ్లినా వెయిటింగ్‌ మాత్రం తప్పలేదు. తమ జెర్సీలపై లోగో వేసుకున్నందుకు చెల్లించాల్సిన స్పాన్సర్‌షిప్ పేమెంట్‌ కూడా బకాయిగానే ఉంది. త్వరలోనే కాంట్రాక్ట్‌లను తిరిగి సమీక్షించే అవకాశం లేకపోలేదు" అని క్రికెటర్లు చెబుతున్నారు. పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు అక్టోబర్ 7 నుండి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మహిళల T20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3న ప్రారంభమైంది.


విపత్కర పరిస్థితుల్లో క్రికెట్..

పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్సీకి బాబర్‌ అజామ్‌ రాజీనామా చేయడంపై పాక్‌ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్‌ తీవ్రంగా స్పందించాడు. తమ జట్టు పరిస్థితి ఐసీయూపాలైందని అన్నారు. ‘‘జాతీయ క్రికెట్ జట్టు నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పాక్‌ క్రికెట్ ఐసీయూలో చేరింది. సరైన వైద్యం అందించడానికి నిపుణులు ఎవరూ లేరు. బాబర్ అజామ్‌ మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించకూడదు. అతడు భారీగా పరుగులు చేసినా... లేదా జట్టు ప్రదర్శన బాగున్నా సరే పట్టించుకోకూడదు. రాజీనామా నిర్ణయం చాలా ఆలస్యంగా వచ్చింది. వ్యక్తిగతంగా బాబర్‌తోపాటు జట్టుకూ నష్టం జరిగింది. ఇకనైనా తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టి రాణించాలి. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలి’’ అని లతీఫ్‌ అన్నారు.

For Latest news and National news click here

Updated Date - Oct 04 , 2024 | 11:20 AM