Share News

Pakistan: పాకిస్తాన్‌లో నెపోటిజం ఈ రేంజ్‌లో ఉంటుంది మరి.. ఆజమ్ ఖాన్ ఎంపికపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!

ABN , Publish Date - May 31 , 2024 | 01:49 PM

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్ ఆజమ్ ఖాన్‌ను ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేయడంపై ఆ దేశ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వ్యవస్థలోనూ అవినీతి, బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.

Pakistan: పాకిస్తాన్‌లో నెపోటిజం ఈ రేంజ్‌లో ఉంటుంది మరి.. ఆజమ్ ఖాన్ ఎంపికపై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం!
Azam Khan

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ-20 మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు కీపింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ క్రికెటర్ ఆజమ్ ఖాన్‌ (Azam Khan)ను ప్రపంచకప్‌ (T20 Worldcup) కోసం ఎంపిక చేయడంపై ఆ దేశ అభిమానులు (Pakistan Fans) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని ప్రతి వ్యవస్థలోనూ అవినీతి, బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయాయని, ఆజమ్ ఖాన్ లాంటి క్రికెటర్‌ను ప్రపంచకప్ కోసం ఎంపిక చేయడమే దానికి నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు (Pakistan vs England).


ఆజమ్ ఖాన్ పాక్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ (Moin Khan) కుమారుడు. అందువల్లే కనీసం బంతిని కూడా పట్టుకోలేకపోతున్న ఆజమ్ ప్రపంచకప్ ఆడబోతున్నాడని పాక్ అభిమానులు అంటున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టీ-20లో ఐదు బంతులు ఎదుర్కొన్న ఆజమ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతేకాదు కీపింగ్ చేస్తూ బంతులను పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. పైగా, క్రికెటర్లకు ఉండాల్సిన కనీస ఫిట్‌నెస్ కూడా లేనట్టు కనిపిస్తున్నాడు. దీంతో పాక్ అభిమానులు అతడిపై, అతడిని ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన వారిపై ట్రోలింగ్ చేస్తున్నారు.


``ప్రపంచకప్‌నకు ఆజమ్ ఖాన్ ఎంపికను గమనిస్తే మా దేశంలో బంధుప్రీతి ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది``, ``ఆజమ్ ఖాన్ ఎంపిక అంతర్జాతీయ క్రికెట్‌కు అవమానకరం``, ``ఆజమ్ ఖాన్‌ను ఎంపిక చేసిన వారికి పాకిస్తాన్ పరువు గురించి కనీసం పట్టింపు లేదు``, ``క్రికెట్ క్రీడకే ఆజమ్ ఖాన్ ఎంపిక సిగ్గు చేట్టు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేటాడే ముందు పులి ఎంత సహనంగా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది..!


Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. నడిరోడ్డు మీద వింత స్టంట్లు ఎందుకోసమో తెలిస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2024 | 01:54 PM