Share News

Ranji Trophy: ముంబై రంజీ ట్రోఫీ నుంచి పృథ్వీ షా అవుట్

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:08 AM

వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీలతో వార్తల్లోకెక్కిన యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడి క్రికెట్ కెరీర్ కూడా ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది.

Ranji Trophy: ముంబై రంజీ ట్రోఫీ నుంచి పృథ్వీ షా అవుట్

ముంబై: ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షా క్రికెట్ కెరీర్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై రంజీ ట్రోఫీ నుంచి ఈ క్రికెటర్ ను తొలగిస్తున్నట్టుగా టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. జట్టు నుంచి పృథ్వీని పక్కన పెట్టడానికి గల కచ్చితమైన కారణాన్ని చెప్పకపోయినప్పటికీ, ఫిట్ నెస్ , క్రమశిక్షణ వంటి విషయాల్లో కోచ్ ల నుంచి అతడిపై ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సంజయ్ పాటిల్ (ఛైర్మన్), రవి ఠాకర్, జీతేంద్ర థాకరే, కిరణ్ పొవార్, విక్రాంత్ యెలిగేటిలతో కూడిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సమాచారం. షా వైఖరితో విసుగుచెంది కనీసం ఒక్క రంజీ ట్రోఫీ ఆటకైనా షాను దూరం పెట్టాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.


సెలక్టర్ల నుంచి ఒత్తిడి?

టీమ్ మేనేజ్ మెంట్ కు సైతం షా వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. నెట్ సెషన్స్ ని ఏమాత్రం సీరియస్ గా తీసుకోడని.. నచ్చినప్పుడు సెషన్స్ కు రావడం అందులోనూ సమయపాలన పాటించకపోవడం వంటి కంప్లెయింట్స్ అతడిపై వినిపిస్తున్నాయి. అధిక బరువు కూడా అతడికి సమస్యగా మారింది. క్రికెట్ ను ఏమాత్రం సీరియస్ గా తీసుకోకపోవడం వల్లే మేనేజ్ మెంట్ అతడిని తొలగించినట్టుగా తెలుస్తోంది. సెలక్టర్లు కూడా ఈ క్రికెటర్ ప్రవర్తనతో విసుగు చెందడంతోనే స్క్వాడ్ నుంచి తప్పించారని అంటున్నారు. 2018లో రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ లోకి షా అడుగుపెట్టాడు.


పర్సనల్ లైఫ్ కాంట్రవర్సీలు..

ఈ చురుకైన ప్లేయర్ ను ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ స‌ప్న గిల్ త‌న‌ను షా వేధించాడంటూ కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ వివాదంతో కోర్టు మెట్లెక్కి తన రెప్యూటేషన్ ను తగ్గించుకున్నాడు. సీజన్‌లో షా ఆడిన రెండు రంజీ గేమ్‌లలో అతను 7,12 (బరోడాపై), 1, 39 నాటౌట్ (మహారాష్ట్రపై) చేశాడు. డాషింగ్ బ్యాటర్ గా పేరుతెచ్చుకున్న షా కెరీర్ విషయంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంతో ఉంటున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

పుజార రికార్డు ‘డబుల్‌’

Updated Date - Oct 22 , 2024 | 11:08 AM