Share News

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్

ABN , Publish Date - Sep 06 , 2024 | 08:09 PM

భారత జట్టు మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌కు ముందే కీలక పదవి స్వీకరించారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా తిరిగి వస్తారని ఫ్రాంఛైజీ శుక్రవారం ప్రకటించింది.

Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
Rahul Dravid

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఇప్పుడు కొత్త పదవి స్వీకరించారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025కి ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమించబడ్డారు. ఇంతకుముందు ఈ జట్టు ప్రధాన కోచ్ కుమార సంగక్కర ఇప్పుడు జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా పని చేయనున్నారు. ద్రవిడ్ 2015 తర్వాత అంటే 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ జట్టులోకి రావడం విశేషం. ఇటీవల కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్‌ను విడిచిపెట్టి KKRలో చేరవచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఆయన జట్టుతో అనుబంధంగా ఉంటాడని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్, సంగక్కరతో కలిసి పని చేయనున్నారు.


గతంలో

మాజీ రాయల్స్ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ 2011 నుంచి 2015 వరకు ఐదు సీజన్‌లకు ఈ ఫ్రాంచైజీతో గడిపారు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని కోచ్‌గా గెలుచుకోవడం ద్వారా ద్రవిడ్ ఇటీవలే టీమ్ ఇండియాతో తన పదవీకాలాన్ని ముగించాడు. ఈ క్రమంలో 51 ఏళ్ల ద్రవిడ్ నిస్సందేహంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరని చెప్పవచ్చు. ఆయన 2014లో రాయల్స్‌తో తన కోచింగ్ కెరీర్‌ను ప్రారంభించారు.

కెప్టెన్‌ నుంచి

ఆ తర్వాత కెప్టెన్‌గా పని చేయడం నుంచి జట్టుకు మెంటార్‌గా మారే స్థాయికి చేరారు. అప్పటి నుంచి ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA), భారత పురుషుల U19, భారత పురుషుల సీనియర్ జట్లతో వివిధ హోదాలలో పనిచేశారు. ఆ క్రమంలో దేశాన్ని టెస్ట్, ODI, T20I ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లే సేవలందించారు.


రాహుల్ ఏమన్నారంటే

రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి రావడంపై రాహుల్ ద్రవిడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను చాలా సంవత్సరాలుగా 'హోమ్' అని పిలిచే ఫ్రాంచైజీకి తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ కప్ తర్వాత ఇది తనకు ఆదర్శంగా ఉందని భావిస్తున్నట్లు తెలిపారు రాహుల్. ఫ్రాంచైజీ గతంలో సాధించిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని మరొక సవాలును స్వీకరించడానికి రాయల్స్ సరైన ప్రదేశమని రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు.


ఫ్రాంచైజీ చీఫ్ స్పందన

రాహుల్‌ను తిరిగి తమ ఫ్రాంచైజీలోకి తీసుకురావడం ఆనందంగా ఉందని రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేక్ లష్ మెక్‌క్రమ్ అన్నారు. ఆయన అసాధారణమైన కోచింగ్ సామర్థ్యాలు, భారత క్రికెట్‌లో ఆయన తీసుకువచ్చిన పరివర్తన స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో తమ ఫ్రాంచైజీతో కూడా రాహుల్ మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని గుర్తు చేశారు. ఈ పరస్పర చర్యలో భాగంగా తమ ఆటగాళ్లకు ప్రతిభను అందించడంలో ఆయన నైపుణ్యం మా ఫ్రాంచైజీకి ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనను మాతో తిరిగి చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్‌కు ఆరో స్వర్ణం.. రికార్డు సృష్టించిన ప్రవీణ్ కుమార్


Sachin Tendulkar: 37 బంతుల్లోనే షాహిద్ అఫ్రీది ఫాస్టెస్ట్ సెంచరీ.. ఆ రికార్డు వెనుక సచిన్ బ్యాట్ పాత్ర ఏంటంటే..

Time Magazine: టైమ్ మ్యాగజైన్ 100 AI జాబితా ప్రభావవంతమైన వ్యక్తుల్లో.. అశ్విని వైష్ణవ్, అనిల్ కపూర్ సహా


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 06 , 2024 | 08:28 PM