Rahul Dravid: ఇషాన్-శ్రేయాస్ కాంట్రాక్ట్ ఇష్యూపై రాహుల్ ద్రవిడ్ స్పందన
ABN , Publish Date - Mar 10 , 2024 | 07:19 AM
బీసీసీఐ నుంచి వార్షిక కాంట్రాక్ట్ రాకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తొలిసారిగా స్పందించారు.
బీసీసీఐ(BCCI) నుంచి వార్షిక కాంట్రాక్ట్ రాకపోవడంతో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) తొలిసారిగా స్పందించారు. ధర్మశాల టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న తర్వాత ద్రవిడ్ ను మీడియా ఇషాన్(Ishan kishan), శ్రేయాస్‌ల(Shreyas iyer) గురించి ప్రశ్నించగా సమాధానం ఇచ్చారు.
అయితే వారికి అవకాశాలు లేవనే అంశాన్ని భారత(team india) ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) శనివారం ఖండించారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడే ప్రతి క్రికెటర్‌కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఫిట్‌గా తిరిగి రావడం ముఖ్యమని వెల్లడించారు. ఇక తాను కాంట్రాక్ట్‌ను నిర్ణయించనని, సెలెక్టర్లు, బోర్డు ఒప్పందాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. కాంట్రాక్టు ఇవ్వడానికి ప్రమాణాలు కూడా తనకు తెలియవని అన్నారు.
ఇటివల రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ఎంచుకున్నామని చెప్పారు. ఆ క్రమంలో ఆటగాళ్లు ఒప్పందంలో ఉన్నారా లేదా అనే దాని గురించి మేము ఎప్పుడూ మాట్లాడలేదని వెల్లడించారు. అంతేకాదు కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల జాబితా కూడా తనకు తెలియదని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌కు దూరమైనప్పటి నుంచి ఇషాన్ క్రికెట్ ఆడలేదు. అతను బరోడాలోని ఒక ప్రైవేట్ సెంటర్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి IPL కోసం సిద్ధమవుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ(BCCI) సూచించినప్పటికీ వెన్నునొప్పి కారణంగా శ్రేయాస్ ముంబై తరఫున రంజీ క్వార్టర్ ఫైనల్స్ ఆడలేదు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: యువహో.. జయహో