Hardik Pandya: మూడు ఓవర్లే బౌలింగ్ చేస్తే ఉపయోగం ఏంటి?.. హార్దిక్ పాండ్యా వన్డే కెరీర్‌పై రవిశాస్త్రి..!
ABN , Publish Date - Jul 29 , 2024 | 04:12 PM
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా ఏళ్ల నుంచి ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేడు. అందుకే చాలా త్వరగానే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు.
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) చాలా ఏళ్ల నుంచి ఫిట్‌నెస్ (Fitness) సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో పాండ్యా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేడు. అందుకే చాలా త్వరగానే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇక, వన్డేల్లో కూడా అతడు తన కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోతున్నాడు. ఫిట్‌నెస్ సమస్యలతోనే గతేడాది ప్రపంచకప్ నుంచి పాండ్యా వైదొలిగిన సంగతి తెలిసిందే. పాండ్యా ఫిట్‌నెస్ గురించి తాజాగా రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడాడు.
``పాండ్యా ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. వన్డే కెరీర్‌ను సీరియస్‌గా తీసుకోవాలి. 10 ఓవర్లు బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఎవరైనా 10 ఓవర్లు బౌలింగ్ వేయాల్సిన చోట 3 ఓవర్లే వస్తే జట్టు సమతూకం దెబ్బతింటుంది. హార్దిక్ వన్డేల్లో కొనసాగుతాడనే అనుకుంటున్నా. ప్రతి మ్యాచ్‌లోనూ 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేయగలిగా, స్థిరంగా బ్యాటింగ్ చేస్తేనే హార్దిక్‌కు వన్డేల్లో చోటుంటుంద``ని రవిశాస్త్రి అన్నాడు.
``తన ఫిట్‌నెస్ స్థాయి ఏంటో హార్దిక్‌కే బాగా అర్థం అవుతుంది. తన శరీరం ఏం చెబుతోందో అతడు గ్రహించగలడు. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ రాణించిన విధానం అతడిలో ఉత్సాహం కలిగిస్తుంది. జట్టుకు అవసరమైన సమయంలో అత్యుత్తమంగా ఆడాడు. ఆ సత్తా పాండ్యాకు ఎప్పుడూ ఉంది. కాకపోతే, ఫిట్‌నెస్ విషయంలోనే పాండ్యా సీరియస్‌గా ఆలోచించాల``ని రవిశాస్త్రి అన్నాడు.
ఇవి కూడా చదవండి..
Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే..!!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..