Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే..!!
ABN , Publish Date - Jul 29 , 2024 | 09:46 AM
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి.
శ్రీలంకతో టీ 20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో సూర్యకుమార్ అనుసరించిన వ్యుహాలు ఫలించాయి. దాంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. సూర్య వేసిన ఎత్తుగడలు ఫలించాయి. జట్టు విజయం సాధించడంలో సూర్య కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆకాశానికి ఎత్తేశారు. ఆ కామెంట్లపై సూర్యకుమార్ స్పందించారు. ఏమన్నారంటే..?
ఫలించిన వ్యూహాలు
శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. 8 ఓవర్లలో ఆ జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 84 పరుగులకి చేరింది. ఆ సమయంలో 9 ఓవర్ అర్ష్ దీప్‌కు ఇచ్చాడు. సూర్య తనపై ఉంచిన నమ్మకాన్ని అర్ష్ దీప్ నిలబెట్టుకున్నాడు. మెండిస్‌ను పెవిలియన్ పంపించాడు. 15వ ఓవర్‌లో అక్షర్ పటేల్‌ను బరిలోకి దింపాడు. కుసాల్ పెరెరా, నిస్సాంకను ఔట్ చేశాడు. దాంతో లంక్ స్కోర్ బోర్డు వేగం తగ్గింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. తర్వాత మ్యాచ్‌ను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 8 ఓవర్లలో 78 పరుగులు చేయాలని టార్గెట్ విధించారు. టీమిండియా బ్యాటర్లు వీర విహారం చేశారు. 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బ్యాటింగ్ ఫెయిల్.. బౌలింగ్ సక్సెస్
రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో ఫెయిల్ అయ్యాడు. బాల్‌తో రెచ్చి పోయాడు. 1.2 ఓవర్లలో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 వికెట్లు తీసి శ్రీలంక జట్టు నడి విరిచాడు. భారత్ జట్టు విజయంలో పరాగ్ కీ రోల్ పోషించాడు. ‘పరాగ్‌ను నేను చాలా దగ్గర నుంచి చూశాను. ప్రత్యేకంగా ఐపీఎల్ సీజన్‌లో అతని ప్రతిభను గుర్తించాను. నెట్స్‌లో బౌలింగ్ తీరును పరిశీలించాను. అతడిని నిశీతంగా గమనించి బౌలింగ్ ఇచ్చాను. ఇచ్చిన అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు అని’ సూర్యకుమార్ యాదవ్ వివరించాడు.
Olympic: తక్షణమే జాబ్ నుంచి తొలగింపు..!!
కెప్టెన్ కాదు..
ఫస్ట్ టీ 20 మ్యాచ్ గెలవడంలో సూర్య కీ రోల్ పోషించాడంతో ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. దాంతో సూర్య కుమార్ స్పందిస్తూ.. ‘నేను జట్టుకు కెప్టెన్‌గా ఉండాలని అనుకోవడం లేదు. టీమ్‌కు నాయకుడిగా ఉండాలని భావిస్తోన్నా. నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇలా చేస్తే తనకు జట్టు సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అదేవిధంగా దేశానికి కూడా మంచిది అని’ సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.