Share News

Rishabh Pant: రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 12 , 2024 | 01:52 PM

ఐపీఎల్ 2024 (IPL2024) ఆరంభానికి ముందు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్-వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ‘‘ డిసెంబర్ 30, 2022న ఉత్తరఖండ్‌లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుధీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్ - బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారిస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది.

Rishabh Pant: రిషబ్ పంత్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన

ఐపీఎల్ 2024 (IPL2024) ఆరంభానికి ముందు డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్-వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ‘‘ డిసెంబర్ 30, 2022న ఉత్తరఖండ్‌లోని రూర్కీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు 14 నెలల సుధీర్ఘ పునరావాసం, రికవరీ ప్రక్రియ తర్వాత రిషబ్ పంత్ ఫిట్‌గా ఉన్నాడని ప్రకటిస్తున్నాం. రాబోయే ఐపీఎల్ 2024కు ముందు వికెట్ కీపర్ - బ్యాటర్‌గా ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారిస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఐపీఎల్‌లో పంత్ ఆడడానిక మార్గం సుగుమమైంది. దీంతో ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ నాయకత్వం వహించనున్నాడు.

కాగా 2022 డిసెంబర్‌లో ఢిల్లీ నుంచి జార్ఖండ్‌లోని తన సొంత ఊరు రూర్కీకి వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై అతడి కారు ప్రమాదానికి గురయ్యింది. తీవ్ర గాయాలపాలయ్యాడు. అదృవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. మోకాలికి కీలకమైన శస్త్రచికిత్స జరిగింది. అయితే ఈ ప్రమాదం కారణంగా పంత్ 14 నెలలపాటు క్రికెట్‌కు దూరమవ్వాల్సి వచ్చింది. సుధీర్ఘ విరామం తర్వాత తిరిగి క్రికెట్ ఆడబోతున్నాడు. కొన్ని వారాల క్రితమే వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌, రన్నింగ్, వార్మప్, స్కిల్ ట్రైనింగ్‌తో సహా అన్నింటిలోనూ శిక్షణ మొదలుపెట్టాడు. ఫిట్‌నెస్ కోసం పలు కసరత్తు కూడా చేశాడు. దీంతో అతడిని పూర్తిగా పరిశీలించిన అనంరతం ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. పంత్ అందుబాటులోకి రావడం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సానుకూలమైన పరిణామంగా మారనుంది. పంత్ లేమితో ఆ జట్టు ఐపీఎల్ 2023 సీజన్‌లో బ్యాటింగ్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

IPL2024: జోరుగా ప్రాక్టీస్ చేస్తున్న హార్ధిక్ పాండ్యా.. వీడియో షేర్ చేసిన ముంబై ఇండియన్స్

Viral Video: పాండ్యా డ్రెస్సింగ్ రూంలో ఒకటే పూజలు..ఇందుకేనా?

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 12 , 2024 | 02:00 PM