Share News

Rohit Sharma: కోహ్లీకి ఆ పదం నచ్చదు.. ప్రపంచకప్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాం: రోహిత్ శర్మ

ABN , Publish Date - Jan 19 , 2024 | 01:14 PM

భారత్‌- అప్గానిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి.

Rohit Sharma: కోహ్లీకి ఆ పదం నచ్చదు.. ప్రపంచకప్ ఓటమిని జీర్ణించుకోలేకపోయాం: రోహిత్ శర్మ

భారత్‌- అప్గానిస్థాన్‌ జట్ల మధ్య బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది (IND vs AFG). ఈ మ్యాచ్‌లో విజేతను తేల్చేందుకు ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు అవసరమయ్యాయి. రెండో సూపర్‌ ఓవర్లో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అద్భుత బౌలింగ్‌తో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకు ఉత్కంఠ విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుత శతకంతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు (Kohli Duckout).

ఈ మ్యాచ్‌లో కోహ్లీ (Virat Kohli) గోల్డెన్ డక్‌గా అవుట్ కావడంపై రోహిత్ (Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ``జట్టులో ఆటగాళ్లందరికీ వారి బాధ్యతలు స్పష్టంగా తెలుసు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అతడు ఎప్పుడూ పరుగులు చేయాలనే కసితోనే ఉంటాడు. అతడికి ``డకౌట్`` అనే పదం నచ్చదు. కానీ, ఫీల్డింగ్‌లో మెరుగ్గా రాణించాడు. సంజూ శాంసన్ దూకుడుగా ఆడాలనే ఆలోచనలోనే త్వరగా అవుటయ్యాడ``ని రోహిత్ వ్యాఖ్యానించాడు. అలాగే వన్డే ప్రపంచకప్ ఫైనల్ (World Cup Final) ఓటమి గురించి కూడా స్పందించాడు.

``వన్డే ప్రపంచకప్ అమోఘంగా సాగింది. చిన్నప్పటి నుంచి వన్డే ప్రపంచకప్‌లను ఎంతో ఆసక్తిగా చూసేవాడిని. వన్డే ప్రపంచకప్ ఎప్పుడూ ప్రత్యేకమే. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అత్యుత్తమ ఆటతీరుతో మేం ఫైనల్ చేరుకున్నాం. చివర్లో ఫలితం దక్కలేదు. అభిమానులు ఎంత నిరుత్సాహానికి గురయ్యారో అర్థం చేసుకోగలను. ఇక, టీ-20 ప్రపంచకప్ గెలిచే అవకాశం మా ముందు ఉంది. దాని కోసం శ్రమిస్తున్నాం`` అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

Updated Date - Jan 19 , 2024 | 01:14 PM