Share News

Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:24 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఉన్నప్పుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, డ్రెస్సింగ్ రూమ్‌లో అంత సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లను ఆట పట్టిస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ఫన్నీ సీన్ కెమెరా కళ్లకు చిక్కింది.

Rohit Sharma: గిల్‌పై రోహిత్ శర్మ ఫ్రాంక్.. కోహ్లీ చెప్పిన మాటతో నవ్వులే నవ్వులు.. వీడియో వైరల్..
Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో ఉన్నప్పుడు ఎంత సీరియస్‌గా ఉంటాడో, డ్రెస్సింగ్ రూమ్‌లో అంత సరదాగా ఉంటాడు. తోటి ఆటగాళ్లను ఆట పట్టిస్తూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ఫన్నీ సీన్ కెమెరా కళ్లకు చిక్కింది. ప్రస్తుతం టీమిండియా చెన్నైలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ (Ind vs Ban Test Match) ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రెండో రోజు పెవిలియన్‌లో ఆ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెమెరా మ్యాన్ పెవిలియన్ వైపు ఫోకస్ చేశాడు. పెవిలియన్‌లో కోచ్ గంభీర్ వెనుక ఆటగాళ్లందరూ కూర్చుని ఉన్నారు. కోహ్లీ, రోహిత్, గిల్ పక్క పక్కనే కూర్చున్నారు. ఆ సమయంలో రోహిత్ రెండు చేతులు చాపి పక్కనే ఉన్న గిల్ దవడపై కొట్టాడు. ఆ తర్వాత వారిద్దరూ నవ్వుకున్నారు. అప్పుడు కోహ్లీ కలుగజేసుకుని కెమెరా మీ మీదే ఫోకస్ చేసి ఉందని చెప్పాడు. దీంతో రోహిత్, గిల్ నవ్వుకున్నారు. ముందు కూర్చున్న గంభీర్ కూడా పెద్దగా నవ్వాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా, తాజా టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 149 పరుగులకే పెవిలియన్ చేరింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ప్రస్తుతం నిలకడగా ఆడుతోంది. మధ్యాహ్నం 12:15 గంటలకు మూడు వికెట్లు కోల్పోయి 218 పరుగులతో ఆడుతోంది. శుభ్‌మన్ గిల్ (87 నాటౌట్), పంత్ (94 నాటౌట్) క్రీజులో ఉన్నారు. జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5), కోహ్లీ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. ప్రస్తుతం టీమిండియా 445 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి..

Virat Kohli: సచిన్ కంటే ముందు.. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ..


Watch Video: మలింగలా బౌలింగ్ చేస్తున్నావు.. షకిబ్‌ బంతులపై కోహ్లీ కామెంట్.. వీడియో వైరల్..


Test Match : బంగ్లా ఢమాల్‌


Ind vs Ban: బంగ్లాదేశ్ మరో తప్పిదం.. ఐసీసీ నుంచి జరిమానా తప్పదా..?


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 21 , 2024 | 12:24 PM