Ind vs Aus: రోహిత్ అలా ఆడితేనే పరిస్థితులు మారతాయి.. ఆరో స్థానంలో అతడు డేంజరస్ బ్యాటర్: రవిశాస్త్రి
ABN , Publish Date - Dec 22 , 2024 | 03:08 PM
కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా కుదురుకోవడంతో రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ స్థానంలో పరిస్థితులకు తగినట్టు ఆడలేక విఫలమవుతున్నాడు. దీంతో రోహిత్ తిరిగా ఫామ్ అందుకోవాలంటే ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమవుతున్నాడు. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనర్‌గా కుదురుకోవడంతో రోహిత్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ స్థానంలో పరిస్థితులకు తగినట్టు ఆడలేక విఫలమవుతున్నాడు. దీంతో రోహిత్ తిరిగా ఫామ్ అందుకోవాలంటే ఓపెనర్‌గానే బరిలోకి దిగాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మాత్రం భిన్నంగా స్పందించాడు. రోహిత్ లాంటి ఆటగాడికి ఆరో స్థానమే కరెక్ట్ అని అభిప్రాయపడ్డాడు (Ind vs Aus Test series).
``కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా మంచి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతడి కవర్‌డ్రైవ్‌లు చూస్తుంటే అతడు ఆ స్థానాన్ని ఆస్వాదిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎలాంటి బాల్ ఆడాలి, దేనిని వదిలేయాలి అనే విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు. రోహిత్ ఓపెనర్‌గా రావాలనుకుంటే తప్పు లేదు. కానీ, నా ఉద్దేశంలో రోహిత్‌కు ఆరో స్థానమే కరెక్ట్. ఆరో స్థానంలో రోహిత్ డేంజరస్ ఆటగాడు. టెస్ట్ క్రికెట్‌లో చాలా మంది దూకుడైన ఆటగాళ్లు ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగుతారు. టెస్ట్ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగేటపుడు రోహిత్ శర్మ తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాల`` ని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
``అప్పటికే ఐదారు వికెట్లు పడిన కారణంగా నెమ్మదిగా ఆడాలని చాలా మంది అనుకుంటారు. కానీ, సాధ్యమైనన్ని పరుగులు చేయడమే లక్ష్యంగా ఆరో నెంబర్ బ్యాటర్ ఎటాకింగ్ చేయాలి. రోహిత్ కూడా అదే పని చేస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. రోహిత్ తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాల``ని రోహిత్ శర్మ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..