Share News

MS Dhoni: 2019 ప్రపంచకప్ సెమీస్‌లో ధోనీ 4వ స్థానంలో వచ్చుంటే బాగుండేది.: రోహిత్ శర్మ

ABN , Publish Date - Aug 25 , 2024 | 01:03 PM

టీమిండియా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ప్రపంచకప్ మ్యాచ్ 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్. ఆ సెమీస్ మ్యాచ్‌లో ఓటమి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ రనౌట్ ఆ మ్యాచ్‌లో పరాజయానికి కారణమైంది.

MS Dhoni: 2019 ప్రపంచకప్ సెమీస్‌లో ధోనీ 4వ స్థానంలో వచ్చుంటే బాగుండేది.: రోహిత్ శర్మ
Rohit Sharma With Dhoni

టీమిండియా అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ప్రపంచకప్ మ్యాచ్ 2019 (2019 World cup)లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్. ఆ సెమీస్ మ్యాచ్‌లో ఓటమి భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ (MS Dhoni) రనౌట్ ఆ మ్యాచ్‌లో పరాజయానికి కారణమైంది. జట్టును విజయ తీరాల వైపు నడిపిస్తున్న దశలో ధోనీ రనౌటై వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ గురించి తాజాగా రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. ఆ మ్యాచ్‌లో ధోనీ నాలుగో స్థానంలో వచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని రోహిత్ అన్నాడు.


``కెప్టెన్‌తో పాటు కోచ్ నిర్ణయమే కీలకం. ఆటగాళ్లందరూ తప్పనిసరిగా వారి నిర్ణయాలను పాటించాల్సిందే. అయితే 2019 ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్‌లో ధోనీ నాలుగో స్థానంలో వచ్చుంటే బాగుండేదని నేను అనుకున్నా. ధోనీ స్థానం చాలా కీలకం అని తెలుసు. అప్పటి కెప్టెన్ విరాట్, కోచ్ ఆలోచనలను నేను తప్పు పట్టడం లేదు. కానీ, ఆ మ్యాచ్‌లో ధోనీ ముందుగానే బ్యాటింగ్‌కు దిగి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని నేను అనుకునే వాడిన``ని రోహిత్ అన్నాడు. ఆ మ్యాచ్‌లో సంయమనంతో ఆడిన ధోనీ రనౌటై అందరినీ నిరాశపరిచాడు.


ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రోహిత్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా (32), పంత్ (32) నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అవటైన తర్వాత ధోనీ (50), జడేజా (77) అమోఘంగా ఆడి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే ధోనీ అనూహ్యంగా రనౌట్ కావడంతో మ్యాచ్ కివీస్ వైపు మలుపు తిరిగింది. చివరకు టీమిండియా 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి..

T20 Match: మిరాకిల్.. 9 వికెట్లు పడగొట్టాడు..


అమ్మో..అది ఎంత భయపెట్టిందో!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 25 , 2024 | 01:22 PM