Rohit Sharma: వచ్చే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడనున్న రోహిత్ శర్మ?
ABN , Publish Date - Aug 26 , 2024 | 05:19 PM
ఈసారి IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్‌లు, కోచ్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు టీ20 టైటిల్‌ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం జరగనుంది. ఈసారి IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్‌లు, కోచ్‌ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. అయితే జట్లలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వదులుకోవాలనే చర్చ ఇప్పటికే మొదలైంది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి కీలక సమాచారం బయటకొచ్చింది. టీమ్ ఇండియాకు టీ20 టైటిల్‌ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చే సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
కొత్త కెప్టెన్ కోసం
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను చేర్చుకునేందుకు జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంజాబ్ కింగ్స్‌కు గత ఎడిషన్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే శిఖర్ ధావన్ ఇటీవల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఐపీఎల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ పంజాబ్‌లో చేరితే జట్టుకు కెప్టెన్‌గా మారవచ్చని అంటున్నారు.
పంజాబ్ కింగ్స్‌లో చేరతాడా?
ప్రస్తుతం టీమ్ ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ పంజాబ్ కింగ్స్ క్రికెట్ డెవలప్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మకు సంబంధించి వేలంలో కనిపిస్తే ఆయనకు భారీ ధర పలికే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఆయనను కొనాలా వద్దా అనేది మన దగ్గర ఎంత డబ్బు ఉందో దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అన్ని ఫ్రాంచైజీలు రోహిత్ శర్మపై తమ దృష్టిని కలిగి ఉన్నాయని చెప్పారు. అంతేకాదు రోహిత్ శర్మ పేరుపై పెద్ద బిడ్లు కూడా ఉంటాయని ఆయన భావిస్తున్నారు.
రోహిత్ శర్మ
2011లో రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. ఆ తర్వాత రోహిత్ ముంబయిని 4 సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా చేశాడు. అయితే గత ఐపీఎల్ ఎడిషన్‌లో రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీని తీసుకుని హార్దిక్ పాండ్యాకు ఇచ్చారు. అప్పటి నుంచి రోహిత్ శర్మ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబయి జట్టు తదుపరి సీజన్‌లో రోహిత్‌ను విడుదల చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత రోహిత్ శర్మ గురించి రోజుకో కొత్త సమాచారం వెలుగులోకి వస్తుంది.
ఇవి కూడా చదవండి:
వచ్చే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్
Read More Sports News and Latest Telugu News