Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా తొలి పోస్ట్ వైరల్
ABN , Publish Date - Jan 26 , 2024 | 04:11 PM
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఇప్పటికే వీరి విడాకుల గురించి సానియా కుటుంబం స్పందించింది. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్లు తెలిపారు. తాజాగా సానియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులతో పంచుకుని ఓ క్యాప్షన్ ఇచ్చారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఆ తర్వాత సానియా మీర్జా(Sania Mirza) ఎలాంటి కొత్త పోస్ట్‌ను షేర్ చేయలేదు. అయినప్పటికీ ఈ సమయంలో ఆమె స్టేటస్ పోస్ట్ చేసేవారు. కానీ షోయబ్ మాలిక్‌పై ఏమీ రాయకుండా దూరం ఉంచారు. ఈ మొత్తం విషయం తర్వాత సానియా తాజాగా మొదటి పోస్ట్ చేసింది. ఇక్కడ కూడా షోయబ్ మాలిక్‌తో తనకున్న రిలేషన్ షిప్ గురించి ఏమీ రాయనప్పటికీ.. మొత్తం స్టోరీని ఒక్కమాటలో చెప్పేసింది. ఇప్పటికే వీరి విడాకుల గురించి సానియా కుటుంబం స్పందించింది. కొన్ని నెలల క్రితమే వారు విడిపోయినట్లు తెలిపారు. తాజాగా సానియా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోను అభిమానులతో పంచుకుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: ఈ స్టాక్‌లలో పెరుగుదల ఉంటుందా... పెట్టుబడి పెట్టాలా వద్దా?
అందులో సానియా అద్దం ముందు నిలబడి ఉండగా... ఆ ఫోటోకు 'రిఫ్లెక్ట్' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఈ పోస్టులో చాలా అర్థం దాగి ఉందని అంటున్నారు. మరికొంత మంది అయితే షోయబ్‌కు కౌంటర్ ఇచ్చారని చెబుతున్నారు. ఆ పదంలో లోతైన అర్థం దాగి ఉందని భావిస్తున్నారు. రిఫ్లెక్ట్ అంటే ప్రతిబింబించు అనే అర్థం కాకుండా లోతుగా లేదా జాగ్రత్తగా ఆలోచించాలనేది వస్తుందని అంటున్నారు. అయితే ఆ పోస్టులో ఎక్కడా కూడా విడాకుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకుండా షోయాబ్‌కు కౌంటర్ ఇచ్చిందని నెటిజన్లు చెబుతున్నారు.
షోయబ్ పాకిస్థానీ నటి సనా జావేద్‌తో మూడో పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లికి ముందు సానియా మీర్జా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేయడంతో వీరి విడాకుల గురించి పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. ఆ నేపథ్యంలోనే షోయబ్ మాలిక్ సనాతో తన పెళ్లికి సంబంధించిన చిత్రాలను పంచుకున్నాడు. సానియా మీర్జా, షోయబ్ 2010లో పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్ల తర్వాత వీరి వివాహ బంధం వీడిపోయింది. సానియా, షోయబ్‌ల విడాకుల వార్త చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంలో ఇద్దరూ మౌనంగా ఉండగా..ఇటివల వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో విడాకుల అంశం బహిర్గతమైంది.