Share News

Ind Vs Nz: పిచ్‌పై సర్ఫరాజ్ ఖాన్ చిందులు.. పంత్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నం!

ABN , Publish Date - Oct 19 , 2024 | 05:31 PM

బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పంత్ రనౌట్ కాకుండా కాపాడుకునేందుకు సర్ఫరాజ్ పిచ్‌పై చిందులు వేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Ind Vs Nz: పిచ్‌పై సర్ఫరాజ్ ఖాన్ చిందులు.. పంత్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నం!

ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పంత్ రనౌట్ కాకుండా కాపాడుకునేందుకు సర్ఫరాజ్ పిచ్‌పై చిందులు వేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో తడబాటుకు లోనైన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా శనివారం ఉదయం నుంచే దూకుడు ప్రదర్శించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్ 50 పైచిలుకు స్కోర్ చేశారు. అయితే, నాలుగో రోజు మాత్రం పంత్, సర్ఫరాజ్ జట్టుకు అండగా నిలిచారు. దూకుడుగా ఆడి వేగంగా అర్థసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. వరుసగా పరుగులు స్కోర్ చేస్తున్న భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు కీవీ బౌలర్లకు తలకుమించిన భాగంగా మారింది. అయితే, పంత్‌ను పెవిలియన్‌కు పంపించే అద్భుత అవకాశం కివీలకు దక్కినా సర్ఫరాజ్ అప్రమత్త కారణంగా పంత్‌కు లైఫ్ లభించింది.

IND vs NZ: హాఫ్ సెంచరీలతో పంత్ అరుదైన రికార్డు..


మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో ఓ సింగిల్ రన్‌కు సర్ఫరాజ్ ప్రయత్నించాడు. కానీ పంత్ మాత్రం రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. బంతివైపు దృష్టి నిలిపి రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. సర్ఫరాజ్ హెచ్చరికలను చూసుకోలేదు. దీంతో, అతడిని నిలువరించేందుకు సర్ఫరాజ్ విశ్వప్రయత్నమే చేశాడు. ఏకంగా పిచ్‌పై చిందులు వేస్తూ అతడి దృష్టి తనపై మళ్లేలా చేశాడు. దీంతో, పంత్ అప్రమత్తమై వెనుదిరిగాడు. కామెంటేటర్ రవిశాస్త్రిని కూడా ఈ సీన్ ఆశ్చర్యపరిచింది. పంత్‌ను కాపాడుకునేందుకు సర్ఫరాజ్ రెయిన్ డ్యాన్స్ చేస్తున్నాడని సరదా వ్యాఖ్యలు చేశారు.

Womens T20 World Cup Final: రేపే ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే..


కాగా, ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. కేవలం 110 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. సర్ఫరాజ్ స్కోరు మూడంకెలు దాటగానే టీమిండియా డ్రెస్సింగ్‌లో రూంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దీంతో, ఒకే టెస్టులో డకౌట్ అవడంతో పాటు సెంచరీ స్కోర్ చేసిన 22వ భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉంటే, ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ దూరమయ్యాడు. అయితే, ఇటీవల బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో గిల్ కూడా ఓ డకౌట్ మరో సెంచరీ స్కోర్ చేశాడు.

కాగా, తన తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ ఏకంగా 356 స్కోర్ చేసింది. రచిన్ రవిచంద్రన్ సెంచరీతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయితే, భారత ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అర్థ సెంచరీలు చేశారు.

Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 19 , 2024 | 05:31 PM