Share News

T20 World Cup 2024: అమెరికా జట్టులో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లు..మనతోనే పోటీ

ABN , Publish Date - May 04 , 2024 | 10:32 AM

జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) అమెరికా(america) జట్టులో భారత జట్టు మాజీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar), హర్మీత్ సింగ్(Harmeet Singh), మిలింద్ కుమార్(Milind Kumar) వంటి క్రికెటర్లు ఉన్నారు.

T20 World Cup 2024: అమెరికా జట్టులో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్లు..మనతోనే పోటీ
Milind Kumar American t20 team

జూన్ 1 నుంచి మొదలయ్యే టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) అమెరికా(america) జట్టులో భారత జట్టు మాజీ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వారిలో సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar), హర్మీత్ సింగ్(Harmeet Singh), మిలింద్ కుమార్(Milind Kumar) వంటి క్రికెటర్లు ఉన్నారు. ఈ టోర్నమెంట్ జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో సంయుక్తంగా జరగనుంది. USA జట్టులో సౌరభ్ నేత్రవల్కర్ తర్వాత అత్యంత ప్రసిద్ధ భారతీయ పేర్లలో ఒకటి మిలింద్ కుమార్.


మిలింద్ కుమార్(Milind Kumar) భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్, రంజీ ట్రోఫీలో ఢిల్లీ, సిక్కింలకు ప్రాతినిధ్యం వహించాడు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలలో కూడా భాగంగా ఉన్నాడు. 2021లో భారత క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత USకి వెళ్లడానికి ముందు 2018-19 రంజీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిలింద్ ఏప్రిల్ 2024లో కెనడాపై USA తరపున అరంగేట్రం చేశాడు.


మరోవైపు 2012లో అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన ఉన్ముక్త్ చంద్(unmukt chand) ఈ T20 ప్రపంచకప్‌లో USA జట్టులో భాగమవుతాడని ఊహించారు. కానీ అతనికి ఛాన్స్ రాలేదు. భారత్‌లో విఫలమై దేశవాళీ క్రికెట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన చంద్ క్రికెట్ కెరీర్‌ను కొనసాగించేందుకు అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అవకాశం దక్కలేదు.


అమెరికా టీ20 ప్రపంచకప్‌ జట్టులో కోరీ అండర్సన్‌(corey anderson)కు కూడా చోటు దక్కింది. ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అంతకుముందు న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2015లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో ఫైనల్‌కు చేరుకున్నాడు. కోరీ 2020లో న్యూజిలాండ్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి అమెరికాకు వెళ్లాడు. రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తర్వాత రెండు దేశాల తరఫున టీ20 ప్రపంచకప్ ఆడిన రెండో క్రికెటర్‌గా కోరీ అండర్సన్ చరిత్రలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ 2014, 2016 ఎడిషన్లలో బ్లాక్ క్యాప్స్ కోసం ఆడాడు. వాన్ డెర్ మెర్వే 2010లో దక్షిణాఫ్రికా, 2016లో నెదర్లాండ్స్‌కు ఆడాడు.


T20 ప్రపంచ కప్ 2024 కోసం అమెరికా జట్టు

మోనాక్ పటేల్ (C), ఆరోన్ జోన్స్ (WK), ఆండ్రీస్ గోస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెసి సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రలేవ్కర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టాయ్ , షాయన్ జహంగీర్


ఇది కూడా చదవండి:

కోల్‌కతా కమాల్‌


పొవెల్‌కే పగ్గాలు


Read Latest Sports News and Telugu News

Updated Date - May 04 , 2024 | 10:56 AM