India vs Sri Lanka: టాస్ గెలిచిన శ్రీలంక.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - Jul 27 , 2024 | 06:47 PM
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం (జులై 27) భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో..
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. శనివారం (జులై 27) భారత్, శ్రీలంక (India vs Sri Lanka) జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. పల్లకెల్లే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. శ్రీలంక టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. భారత జట్టు బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ (Suryakumar) సారథ్యంలో టీమిండియా ఆ టీ20 సిరీస్ ఆడబోతోంది కాబట్టి.. ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
నిజానికి.. చాలాకాలం నుంచి మన భారత జట్టు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఏ టోర్నీలో తలపడినా.. ఆ జట్టుని చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తోంది. మరి.. అదే ఆధిపత్యాన్ని ఈ సిరీస్‌లోనూ కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి. మరోవైపు.. ఇది తమ దేశంలో జరుగుతున్న సిరీస్ కావడంతో, భారత్ చేతిలో అవమానంపాల్వకుండా ధీటుగా రాణించాలని చూస్తోంది. పైగా భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు లేరు కాబట్టి.. ఈ అంశాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుపై విజయఢంకా మోగించాలని భావిస్తోంది. మరి.. హోరాహోరీగా సాగనున్న ఈ సమరంలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.
కాగా.. ఈ సిరీస్‌తో భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కోచ్, కెప్టెన్.. ఇద్దరూ కొత్తవాళ్లే కాబట్టి.. వాళ్లిద్దరూ తమదైన ముద్ర చూపిస్తారా? లేదా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇప్పటికే గంభీర్ తొలి సిరీస్‌కు జట్టు ఎంపికలోనే తనదైన ముద్ర వేశాడు. అటు.. సూర్యకుమార్ ఈ జట్టుని సారథిగా ఎలా నడిపిస్తాడన్నదీ ఎంతో కీలకమే. ఇదిలావుండగా.. భారత తుది జట్టులో శివమ్ దూబె, సంజు శాంసన్, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం దక్కలేదు.
తుది జట్లు
భారత్: శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషభ్ పంత్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), వానిందు హసరంగ, డాసున్ శనక, మహీశ్ తీక్షణ, మతీశా పతిరణ, అసిత ఫెర్నాండో, దిల్షన్ మధుశంక.
Read Latest Sports News and Telugu News