Share News

T20 World Cup 2024: నేడు పాకిస్తాన్ vs అమెరికా మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే

ABN , Publish Date - Jun 06 , 2024 | 08:36 AM

టీ20 వరల్డ్ కప్‌ 2024లో నేడు పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ డల్లాస్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ మైదానంలో కెనడాపై ఇప్పటికే అమెరికా ఘన సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చుద్దాం.

T20 World Cup 2024: నేడు పాకిస్తాన్ vs అమెరికా మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే
T20 World Cup 2024 match 11 pak vs usa

టీ20 వరల్డ్ కప్‌ 2024(T20 World Cup 2024)లో నేడు పాకిస్తాన్(Pakistan) తన మొదటి మ్యాచ్‌లో అమెరికా(america)తో తలపడనుంది. ఈ మ్యాచ్ డల్లాస్‌(Dallas)లో భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరగనుంది. ఈ మైదానంలో కెనడాపై ఇప్పటికే అమెరికా ఘన సాధించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఇప్పుడు చుద్దాం.

డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియం(Grand Prairie Stadium) అమెరికాలో ప్రధాన క్రికెట్ మైదానమని చెప్పవచ్చు. గతేడాది మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్‌తో సహా 19 మ్యాచ్‌లు ఈ మైదానంలో జరిగాయి. ఇక్కడి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌ ఇదే మైదానంలో జరిగింది. కెనడా 194 పరుగులు చేసి 18వ ఓవర్లోనే అమెరికా లక్ష్యాన్ని సాధించింది. అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లోనూ పక్కాగా పరుగుల వర్షం కురుస్తుందని చెప్పవచ్చు.


ఇక అమెరికా, పాకిస్తాన్(United States vs Pakistan) జట్ల మధ్య తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ అగ్రశ్రేణి జట్టుగా ఉన్నప్పటికీ అమెరికా జట్టులో కూడా భారత్, పాకిస్తాన్ సహా పలు దేశాల ఆటగాళ్లు ఉన్నారు. వన్డేల్లో 36 బంతుల్లో సెంచరీ సాధించిన కోరీ అండర్సన్ అమెరికా తరఫున ఆడుతున్నాడు. జట్టు కెప్టెన్ మోనాక్ పటేల్ భారతీయుడు కాగా, ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ పాకిస్తాన్ కు చెందినవాడు. ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే పాకిస్తాన్ గెలిచే ఛాన్స్ 89 శాతం ఉండగా, అమెరికాకు 11 శాతం మాత్రమే ఉందని తెలిపింది.


అమెరికా(america) జట్టులో స్టీవెన్ టేలర్, మాంక్ పటేల్ (వికెట్/కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, కోరీ అండర్సన్, హర్మీత్ సింగ్, నితీష్ కుమార్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, అలీ ఖాన్, జస్దీప్ సింగ్, సౌరభ్ నేత్రవాల్కర్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నస్తుష్ కెంజిగే, షాయన్ జహంగీర్ ఉన్నారు.

పాకిస్తాన్(Pakistan) జట్టులో బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రీది నాది కలరు.


ఇవి కూడా చదవండి

T20 World Cup India vs Ireland : బోణీ అదిరింది..!

భారత ఫ్యాన్స్‌కు అనుకూలంగా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సమయాలు

For mor Sports News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 08:44 AM