Ricky Ponting: కోహ్లీ, రోహిత్ కాదు.. సచిన్ రికార్డు బద్దలుగొట్టే ఛాన్స్ ఆ క్రికెటర్‌కే ఉంది: రికీ పాంటింగ్
ABN , Publish Date - Aug 16 , 2024 | 02:17 PM
టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సచిన్ సృష్టించిన చాలా రికార్డులను ఇప్పటివరకు మరే ఆటగాడూ టచ్ చేయలేకపోతున్నాడు. అటు టెస్ట్‌ల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిటే ఉంది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సచిన్ సృష్టించిన చాలా రికార్డులను ఇప్పటివరకు మరే ఆటగాడూ టచ్ చేయలేకపోతున్నాడు. అటు టెస్ట్‌ల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ పేరిటే ఉంది. వన్డేల్లో సచిన్ రికార్డులకు కోహ్లీ (Virat Kohli) చేరువగా వచ్చాడు. అయితే టెస్ట్‌ల్లో మాత్రం చాలా దూరంలో ఉండిపోయాడు. సచిన్ టెస్ట్ రికార్డులను (Sachin Tendulkar's record) బద్దలుగొట్టే అవకాశాలున్న ఆటగాడి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తాజాగా మాట్లాడాడు.
టెస్ట్‌ల్లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) మాత్రమే అధిగమించగలడని పాంటింగ్ అన్నాడు. మరో మూడేళ్ల పాటు జో రూట్ నిలకడగా ఆడగలిగితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడని అభిప్రాయపడ్డాడు. జో రూట్ టెస్ట్‌ల్లో 12 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు. దీంతో సచిన్ వరల్డ్ రికార్డ్‌ను రూట్ అధిగమిస్తాడనే చర్చ జోరుగా సాగుతోంది. తన కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో 15,921 పరుగులు చేశాడు.
సచిన్‌కు చేరువలో మరే ఆటగాడు లేడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో జో రూట్ మాత్రమే సచిన్ తర్వాత 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.``జో రూట్ మాత్రమే సచిన్ రికార్డును అధిగమించగలడు. అతడికి ఇప్పుడు 33 ఏళ్లు మాత్రమే. రూట్ ప్రస్తుతం సచిన్ కంటే 3 వేల పరుగులు వెనుకంజంలో ఉన్నాడు. రూట్ ఏడాదికి 10 నుంచి 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 800 నుంచి 1000 పరుగులు చేస్తే.. మూడు, నాలుగేళ్లలో సచిన్ రికార్డును అధిగమిస్తాడ``ని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి..
Jay Shah: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాల్సిన అవసరం లేదు.. బీసీసీఐ కార్యదర్శి జై షా ఏమన్నారంటే..
తీర్పుపై స్విస్ కోర్టుకు.. వినేశ్ ఫొగట్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..