Share News

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:53 PM

పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.

Paris olympics: వినేష్ ఫోగట్ సంచలనం.. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించి..
Vinesh Phogat

పారిస్ ఒలింపిక్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ యువీ సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించిన భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. క్వార్టర్ ఫైనల్స్‌లో విజయం సాధించి సెమీస్‌కు చేరింది. దీంతో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. సెమీఫైనల్స్‌లో గెలిస్తే స్వర్ణ లేదా రజత పతకాలను గెలుచుకునే అవకాశం ఉంది. సెమీస్‌లో ఓడితే కాంస్య పతకపోరులో తలపడాల్సి వస్తుంది. ఇవాళ మొదటి పోరులో టోక్యో ఒలింపిక్స్‌ బంగారు పతక విజేతతో పాటు నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జపాన్ క్రీడాకారిణి యువీ సుసాకిని 3-2తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. మొదట వినేష్ 0-2తో వెనుకబడి ఉంది. కానీ చివరి నిమిషంలో పుంజుకుని ఓటమిని విజయంగా మార్చుకుంది.


సెమీస్‌కు..

జపాన్ క్రీడాకారిణి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన ఫోగట్ మరింత ఆత్మవిశ్వాసంతో క్వార్టర్స్‌లో తలపడింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి ఒక్సానా లివాచ్‌ను క్వార్టర్స్‌లో 7-5తో ఓడించి సెమీఫైనల్స్‌కు చేరింది. మహిళల 50 కిలోల రెజ్లింగ్‌లో పోటీపడిన ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్‌లో మొదటి రౌండ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రౌండ్ 4-0 అధిక్యంలోకి వెళ్లగా. చివరికి 7-5తో లివాచ్‌ను ఓడించి సెమీస్‌కు ప్రవేశించింది.


పతకంపై ఆశలు..

భారత్ ఇప్పటివరకు షూటింగ్‌లో మూడు కాంస్య పతకాలను గెలుచుకుంది. బ్యాడ్మింటన్‌లో పతకం ఆశలు కోల్పోవడంతో.. ఇక జావెలిన్ త్రో, రెజ్లింగ్ పైనే భారత్ ఆశలు పెట్టుకుంది. ఈ రెండింటిలో రెండు పతకాలు వస్తే భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరుతుంది. ప్రపంచ నెంబర్1ను మట్టికరిపించడంతో వినేష్ ఫోగట్ పతకం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పతకం ఆశలు సజీవంగా ఉంచాడు. దీంతో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 06 , 2024 | 04:53 PM