Share News

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?

ABN , Publish Date - Aug 07 , 2024 | 07:50 PM

వినేష్ ఫోగట్ వంద నుంచి 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌‌లో ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బంగారు పతకం పోవడంతో ఓవైపు భారతీయులంతా నిరాశతో ఉన్నారు.

Paris Olympics: గంటల వ్యవధిలో వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగింది.. కారణం వాళ్లేనా..?
Vinesh Phogat

వినేష్ ఫోగట్ వంద నుంచి 150 గ్రాముల బరువు ఎక్కువుగా ఉండటంతో ఆమెపై పారిస్ ఒలింపిక్స్‌‌లో ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ అంశం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బంగారు పతకం పోవడంతో ఓవైపు భారతీయులంతా నిరాశతో ఉన్నారు. ఈక్రమలో వినేష్ ఫోగట్ అనూహ్యంగా బరువు పెరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వినేష్ ఫోగట్ తన మొదటి మ్యాచ్ ఆడటానికి ముందు.. అంటే మంగళవారం ఉదయం నిర్వహించిన బరువు పరీక్షలో 50 కిలోల కంటే తక్కువుగా ఉన్నారు. తరువాత రోజు పరీక్షలో ఆమె ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాములు ఎక్కువుగా ఉన్నప్పటికీ ఆమె పెరిగిన బరువు మాత్రం దాదాపు 2 కేజీలుగా ఉంది. గంటల వ్యవధిలో 2 కేజీల బరువు ఎలా పెరిగిందనేది ఎవరికి అంతుపట్టడంలేదు. ఉదయం బరువు పరీక్ష తర్వాత ఆమె మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. అంటే ఆమె కొంత శక్తిని వెచ్చించింది. ఈ సమయంలో వినేష్ బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవేళ బరువు పెరిగిందంటే మాత్రం మ్యాచ్‌ల మధ్య వచ్చిన గ్యాప్‌లో తీసుకున్న ఆహారం కారణంగానే ఆమె బరువు పెరగాలి. వినేష్‌కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.. ఆమె ఏం తీసుకుంటుందనేది తన కోచ్ పర్యవేక్షించాల్సి వస్తుంది. కోచ్ పట్టించుకోకపోవడంతోనే ఆమె బరువు పెరిగిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నీళ్లు ఎక్కువుగా తాగడం వలన అధికంగా బరువు పెరిగిందని వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి. ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడటంతో వినేష్ ఫోగట్ బరువు ఎందుకు పెరిగిందనేది తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆమె మంగళవారం రాత్రి సెమీఫైనల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత బరువు చూస్తే దాదాపు 53 కేజీల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పటినుంచి బరువు తగ్గడం కోసం తీవ్రంగా సాధన చేసినప్పటికీ.. ఉదయం బరువు పరీక్ష సమాయానికి ఉండాల్సిన బరువుకంటే 100 గ్రాముల అధికంగా ఉండటంతో వినేష్‌పై అనర్హత వేటు పడింది.

Olympics 2024: ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫోగట్ ఔట్


100 గ్రాములు కాదు.. 2 కేజీలు..

వినేష్ ఫోగట్ 50 కేజీల విభాగంలో పోటీపడుతుండటంతో ఆమె బరువు 50 కిలోలు మించకూడదు. అయితే 100 గ్రాముల బరువు అధికం కారణంగా ఆమె ఒలింపిక్స్‌ ఫైనల్స్ ఆడలేకపోతుందనేది ప్రచారమవుతోంది. కానీ వినీష్ ఫోగెట్ నిన్న ఉదయం నుంచి రాత్రికి పెరిగిన వయసు 2కేజీలు దానిని తగ్గించుకుంటూ రావడంతో చివరికి 50 కేజీల 100 గ్రాములుగా తేలింది. తాను రెండు కిలోల బరువు ఎక్కువుగా ఉన్నానని తెలుసుకోవడంతో రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఆ రెండు కిలోలు తగ్గడానికి చాలా కష్టపడింది. అన్ని రకాల వ్యాయామాలు చేసింది. అయితే వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు సెమీస్‌కు మధ్య కొన్ని గంటల గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో తీసుకున్న ఆహారం కారణంగానే బరువు పెరిగిందనేది స్పష్టమవుతోంది. ప్లేయర్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో చూసుకోవల్సిన బాధ్యత ఆమెతో ఉండే కోచ్‌తో పాటు.. సహాయక సిబ్బంది చూసుకోవల్సి ఉంటుంది. ఆమె బరువు పెరిగేలా డైట్ తీసుకుందంటే ఇక్కడ ఆమె కోచ్, సహాయక సిబ్బంది వినేష్ ఏం తింటుందో పర్యవేక్షించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి రెజ్లింగ్ క్రీడాకారులకు శక్తి అవసరం. కుస్తీ పోటీల్లో పోరాడాలంటే అవసరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. కానీ తీసుకునే ఆహారం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడం క్రీడాకారులతో పాటు.. వారి కోచ్, డైట్ ప్లానర్, సహాయక సిబ్బందిపై ఉంటుంది. కానీ వినేష్ విషయంలో డైట్ కంట్రోల్ లేకపోవడంతోనే బరువు పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైద్యుల నివేదిక మరింత ఆసక్తిగా మారింది.

నాడు న్యాయం కోసం నేడు దేశం కోసం


వైద్యులు ఏమంటున్నారంటే..

వినేష్ ఫోగట్ బరువు పెరగడం, నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఒలింపిక్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పిటి ఉషతో కలిసి భారత ఒలింపిక్ జట్టు వైద్యులు డాక్టర్ దిన్షా పౌడివాలా ఓ ప్రకటన చేశారు. అలాగే వినీష్ యొక్క పోహకాహార నిపుణుడు పార్దివాలా ఆమె రోజుకు తీసుకునే ఆహారం కేవలం 1.5 కిలోలు మాత్రమేనని చెప్పారు. అయితే మంగళవారం ముగ్గురితో పోటీపడాల్సి రావడంతో డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎక్కువ మొత్తంలో నీరు ఇవ్వాల్సి వచ్చిందని, నీరు అధికంగా తాగడం ద్వారా బరువు పెరిగినట్లు గుర్తించామన్నారు. ఆమె బరువును తగ్గించే ప్రయత్నంలో వినేష్ జుట్టును కత్తిరించామని పార్దివాలా తెలిపారు. కోచ్ వినేష్ వెంట ఉంటూ రాత్రంతా బరువు తగ్గించే ప్రక్రియను కొనసాగించినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు.


ఒకే ఒక్క త్రో...

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 07:50 PM