Share News

Viral Vidoe: మ్యాచుకు ముందు న్యూయార్క్‌ వీధుల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:25 PM

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), తన భార్య అనుష్క శర్మ(Anushka Sharma) తమ న్యూయార్క్(New York) పర్యటనలో షికారు చేస్తున్నారు. ఆ క్రమంలో అమెరికాలోని అందమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ వీధుల్లో అనుష్క, విరాట్ వాక్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Vidoe: మ్యాచుకు ముందు న్యూయార్క్‌ వీధుల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
Virat Kohli and Anushka Sharma newyork

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), తన భార్య అనుష్క శర్మ(Anushka Sharma) న్యూయార్క్(New York) పర్యటనలో షికారు చేస్తున్నారు. ఆ క్రమంలో అమెరికాలోని అందమైన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ వీధుల్లో అనుష్క, విరాట్ వాక్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో భార్యాభర్తలు క్యాజువల్ లుక్‌లో నడుస్తూ కనిపించారు. ఈ సందర్భంగా విరాట్ తన భార్య పట్ల ప్రేమ చూపించినట్లుగా కనిపిస్తుంది.


ఆ సమయంలోనే ఓ అమెరికన్ వ్యక్తి నడకతో అనుష్కను కొంచెం కలవరపెట్టినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో విరాట్ కొంచెం కంగారుపడినట్లు అనిపిస్తుంది. కోహ్లి తన భార్యను కారులో కూర్చోబెట్టాలనుకున్న క్రమంలోనే వారి ఎస్‌యూవీ పక్కనుంచి మరో వ్యక్తి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో అనుష్కను ఇటు వైపు వచ్చి ఎక్కాలని కోహ్లీ కోరడంతో అనుష్క వచ్చేస్తుంది. అటుగా వచ్చిన ఓ వ్యక్తి వారిని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.


టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ T20 ప్రపంచ కప్ 2024 కోసం గత వారం న్యూయార్క్ బయలుదేరాడు. ఆ సమయంలో ముంబై విమానాశ్రయంలో అతనితో పాటు అనుష్క శర్మ, వారి పిల్లలు వామిక, అకే కూడా ఉన్నారు. ఆ క్రమంలో విరాట్ కోహ్లీ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో పాటు అనుష్కను అనుసరించవద్దని ఫోటో గ్రాఫర్లను అభ్యర్థించాడు. ఆమె దగ్గర పిల్లలు ఉన్నారని కోహ్లీ స్పష్టం చేశాడు. నేడు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో విరాట్ ఏ మేరకు స్కోర్ చేస్తాడో చూడాలి మరి.


ఇది కూడా చదవండి:

T20 World Cup 2024: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధర.. తెలిస్తే షాక్ అవుతారు

Narendra Modi Swearing Ceremony: నేడు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధం.. నేడు, రేపు ఆంక్షలు, 500 సీసీటీవీలతో..

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 09 , 2024 | 01:26 PM