Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించిన కింగ్!
ABN , Publish Date - Mar 22 , 2024 | 09:28 PM
కొద్ది కాలంగా క్రికెట్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లోనే సంచలన రికార్డు నమోదు చేశాడు.
కొద్ది కాలంగా క్రికెట్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఐపీఎల్-2024 (IPL-2024) తొలి మ్యాచ్‌లోనే సంచలన రికార్డు నమోదు చేశాడు. టీ-20 క్రికెట్‌లో వేరే భారతీయుడు ఎవరూ ఇప్పటివరకు సాధించలేకపోయిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు (Virat Kohli Record). టీ-20 క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. ప్రపంచం మొత్తం మీద ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు (T20 record).
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరులోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతున్నాయి (CSK vs RCB). ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగిన కోహ్లీ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 12 వేల మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (13,360), పోలార్డ్ (12,900), అలెక్స్ హేలీ (12,319), డేవిడ్ వార్నర్ (12,065) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో చోటు సంపాదించిన తొలి ఇండియన్‌గా కోహ్లీ నిలిచాడు.
అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీది మూడో స్థానం. కోహ్లీ 377 మ్యాచ్‌లు ఆడి 12 వేల పరుగులు పూర్తి చేశాడు. క్రిస్ గేల్ (353 మ్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (369 మ్యాచ్‌లు) మాత్రమే కోహ్లీ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో 12 వేల పరుగులు పూర్తి చేశారు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కోహ్లీ మరో ఘనత సాధించాడు.