Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో విరాట్ మరో రికార్డ్.. 9 వేల పరుగులు
ABN , Publish Date - Oct 18 , 2024 | 06:12 PM
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సాధించారు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సాధించారు. భారత్- న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సచిన్ (15,921), రాహుల్ ద్రవిడ్(13, 265), సునీల్ గావస్కర్ (10, 122) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా 18వ స్థానంలో నిలిచాడు. 197 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
బెంగళూరు వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి విరాట్ వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడుగా మారాడు. అనంతరం జరిగిన బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లోనూ సరైన ప్రతిభ చూపించలేకపోయాడు. వరుస వైఫల్యాలతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్న విరాట్‌కు తాజా రికార్డ్ ఊరటనిచ్చిందే. విరాట్ కోహ్లీ 102 బంతుల్లో 70 పరుగుల వద్ద ఔట్ కాగా, భారత్ 125 పరుగుల వద్ద వెనుకంజలో ఉంది. 3వ రోజు చివరి బంతికి విరాట్ ఔటయ్యాడు. మూడో రోజు ముగిసే సమయానికి భారత్ 231/3తో నిలిచింది.
టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 2013లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై జరిగింది. టెస్ట్ క్రికెట్‌లో 7 డబుల్ సెంచరీలు సాధించాడు. ఢిల్లీ టెస్ట్ మ్యాచ్ శ్రీలంకతో జరిగినప్పుడు కోహ్లీ 287 బంతుల్లో 243 పరుగులు చేశాడు. మార్చి 2023లో అతను అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. క్రీజులో 8.5 గంటలకు పైగా గడిపాడు. 364 బంతుల్లో 186 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 29 సెంచరీలు చేశాడు.
తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ...
తొలి ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో 9 బంతుల్లోనే విరాట్ కోహ్లిని న్యూజిలాండ్ పేసర్ విలియం ఒరూర్క్ అవుట్ చేశాడు. విరాట్ షార్ట్-లెంగ్త్ బాల్‌ను డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అదనపు బౌన్స్ కారణంగా బంతి అతని గ్లోవ్‌కు తగిలి క్యాచ్‌కి దారితీసింది.
Read More National News and Latest Telugu News
ఇది కూడా చదవండి..