WWE Superstar: డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ కన్నుమూత.. నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ ఇతను..
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:13 PM
WWE Superstar: రెజ్జింగ్ దునియాను ఓ ఊపు ఊపిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ కన్నుమూశాడు. అదిరిపోయే ఆటతో కోట్లాది మంది హృదయాలు గెలుచుకున్న ఆ వీరుడు ఇక లేడు. ఎవరా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ అనేది ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో గేమ్స్ అంటే ముందుగా ఎవ్వరైనా క్రికెట్ పేరే చెబుతారు. క్రికెట్ అన్నా, క్రికెట్ స్టార్లన్నా ఇక్కడి వారికి ఎంత ప్రేమో మాటల్లో వర్ణించలేం. కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్ లాంటి ఇతర ఆటలకూ మంచి ఆదరణే ఉన్నా జెంటిల్మన్ గేమ్‌కు ఉన్నంత ఆదరణ లేదు. అయితే భారత్‌లో మరో గేమ్‌కు సూపర్బ్ క్రేజ్ ఉంది. అందులో ఆడే స్టార్లు అంటే ఇక్కడి వారికి పిచ్చి ప్రేమ. అదే వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ). జాన్ సీనా నుంచి బిగ్ షో వరకు.. ఖలీ నుంచి రాక్ వరకు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు మన దేశంలో ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అలాంటి తోపు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లలో ఒకరు ఇవాళ కన్నుమూశాడు. అతడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
వేగమే ఆయుధం
ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రే మిస్టరీయో సీనియర్ మృతి చెందాడు. అంకుల్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈగా పేరు తెచ్చుకున్న ఈ మెక్సికన్ రెజ్లర్ శుక్రవారం 66 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో దాదాపుగా ప్రతి టాప్ రెజ్లర్‌ను ఓడించిన ఘనత రే మిస్టీరియోది. చూడటానికి పొట్టిగా కనిపించినా తన తెలివితో అతడు తోపు ఫైటర్లకు కూడా పోయించేవాడు. రింగ్‌లో మెరుపు వేగంతో కదులుతూ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇన్నాళ్లూ తన ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించిన అలాంటోడి మరణం జీర్ణించుకోవడం కష్టమే.
తోపు రెజ్లర్‌గా..
రే మిస్టీరియో అసలు పేరు మిగ్యూల్ ఏంజెల్ లోపెజ్ డియాస్. 1976లో వరల్డ్ రెజ్జింగ్ దునియాలోకి అడుగుపెట్టిన అతడు.. వరుస విజయాలతో తక్కువ సమయంలోనే తోపు రెజ్లర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగుపెట్టి అక్కడ కూడా సంచలన విజయాలు సాధించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ జూనియర్ లైట్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌నూ కైవసం చేసుకున్నాడు. అతడి వారసత్వాన్ని కొనసాగిస్తూ రే మిస్టీరియో జూనియర్ రెజ్లింగ్ ప్రపంచంలో సంచలన విజయాలు అందుకున్నాడు.
Also Read:
భారత్-పాకిస్థాన్ బార్డర్‌లో స్టేడియం.. గట్టి స్కెచ్చే..
అశ్విన్ భార్య ఎమోషనల్.. దాని గురించే ఆలోచిస్తున్నానంటూ..
టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..
అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా
For More Sports And Telugu News