Share News

IPL 2024: చాహల్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. క్లాసెన్ కొట్టిన ఆ సిక్స్ చూస్తే..

ABN , Publish Date - May 25 , 2024 | 11:58 AM

రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఓ చెత్తి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇంతకు ముందు ఈ రికార్డు స్పిన్నర్ పియూష్ చావ్లా పేరిట ఉండేది. ఆ రికార్డును తాజాగా చాహల్ అందుకున్నాడు.

IPL 2024: చాహల్ పేరిట అత్యంత చెత్త రికార్డు.. క్లాసెన్ కొట్టిన ఆ సిక్స్ చూస్తే..
Yuzvendra Chahal

రాజస్థాన్ రాయల్స్ (RR) స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal) ఓ చెత్తి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ (IPL 2024) చరిత్రలోనే అత్యధిక సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా అగ్రస్థానానికి ఎగబాకాడు. ఇంతకు ముందు ఈ రికార్డు స్పిన్నర్ పియూష్ చావ్లా పేరిట ఉండేది. ఆ రికార్డును తాజాగా చాహల్ అందుకున్నాడు. శుక్రవారం సాయంత్రం చెన్నైలో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలియఫయర్-2 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే (RR vs SRH).


ఈ మ్యాచ్‌లో చాహల్ బౌలింగ్‌లో చాలా నిరాశపరిచాడు. నాలుగు ఓవర్లు వేసి వికెట్లేమీ తియ్యకుండా 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చాహల్ రెండు సిక్స్‌లు ఇచ్చాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 224 సిక్స్‌లు సమర్పించుకున్న బౌలర్‌గా చాహల్ నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పియూష్ చావ్లా (222) పేరిట ఉండేది. కాగా, చాహల్ బౌలింగ్‌లో హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆఫ్‌సైడ్ కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.


శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. క్లాసెన్ (50), రాహుల్ త్రిపాఠి (37), హెడ్ (34) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధ్రువ్ జురెల్ (56), యశస్వి జైస్వాల్ (42) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి..

Kohli: హైదరాబాద్‌లో అందుబాటులోకి కోహ్లి రెస్టారెంట్‌


Team India Coach: టీమిండియా కోచ్ చాలా రాజకీయాలు ఎదుర్కోవాలి.. రాహుల్ సూచనను మర్చిపోలేను: జస్టిన్ లాంగర్


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 25 , 2024 | 11:58 AM