Apple: యాపిల్ నుంచి మరింత మెరుగ్గా సిరి.. ఈసారి వాయిస్ ఒక్కటే కాదు..!
ABN , Publish Date - May 31 , 2024 | 12:28 PM
యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.
యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం. ప్రధానంగా iOS 18 అప్‌డేట్ సహా సిరి(Siri)కి అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ క్రమంలో సిరికి అప్‌గ్రేడ్‌లను తీసుకురావాలని యోచిస్తోంది. ఇది వినియోగదారుల వాయిస్ మాత్రమే కాదు, ఇసారి అంతకు మించి పనులను చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
సిరి(Siri) వ్యక్తిగత యాప్ ఫంక్షన్‌లను నియంత్రించేలా చేస్తుందని, మొదటి సారిగా సిరి అనేక ఫీచర్లను కమాండ్ చేయగలదని నివేదిక చెబుతోంది. Siri iPad లేదా iPhoneని మరింత మెరుగ్గా, ఖచ్చితత్వంతో నియంత్రించగలదని రిపోర్ట్ తెలిపింది. ఉదాహరణకు AI సహాయంతో Siri వ్యక్తిగత పత్రాలు, ఫోల్డర్, ఇమెయిల్‌ను ఓపెన్ చేయడం, పంపించడం లేదా తొలగించడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. దీంతోపాటు యాపిల్ Newsను తెరవడం, వెబ్ లింక్‌ను ఓపెన్ చేయడం వంటివి చేయగలదని రిపోర్ట్ వెల్లడించింది. అంతేకాదు సిరి నియంత్రిత లక్షణాలను స్వయంచాలకంగా ఆపరేట్ చేయడంతోపాటు అనేక విభిన్న కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుందని పేర్కొన్నారు.
ఒకే సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమివ్వడం, చాట్ చేయగల సామర్థ్యాన్ని సిరి కల్గి ఉందని నివేదిక తెలిపింది. కొత్త సిరి అప్‌గ్రేడ్(upgrade) Apple ఇతర AIలతో పోల్చితే మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆపిల్ సిరిని మరింత విస్తృతంగా అన్వేషించడానికి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది తెలిసిన ఐఫోన్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే ఈవెంట్‌లో AIకి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటనలు రాబోతున్నాయని టెక్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇది కూడా చదవండి:
Alert: వీటికి నేడే లాస్ట్ డేట్.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే
Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి
Read Latest Technology News and Telugu News