Tech Trends: 2025లో రానున్న సాంకేతిక ఆవిష్కరణలేంటో తెలుసా
ABN , Publish Date - Dec 30 , 2024 | 10:45 AM
మీరు టెక్నాలజీ ప్రియులా, అయితే ఈ వార్త మీ కోసమే. ఈ క్రమంలో 2025లో కొత్తగా వచ్చే సాంకేతికతల గురించి ఇక్కడ తెలుసుకుందాం. క్వాంటం కంప్యూటింగ్, డేటా కేంద్రాలు, రోబోటిక్స్ వంటి అనేక మార్పులు రాబోతున్నాయి.
కొత్త సంవత్సరం 2025 రాబోతుంది. కొత్త ఏడాదిలో రాబోయే సాంకేతికతల గురించి ఇక్కడ చూద్దాం. కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, డేటా కేంద్రాలు, రోబోటిక్స్, స్వయంప్రతిపత్త వాహనాలు వంటి వినూత్న సాంకేతికతలు రాబోతున్నాయి. ఇవి మన జీవనశైలిని, పనితీరును మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. అయితే వీటి పనితీరు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
క్వాంటం కంప్యూటింగ్
సాంప్రదాయ కంప్యూటర్లు ఎన్నడూ పరిష్కరించలేని సమస్యలను క్వాంటం కంప్యూటింగ్ పరిష్కరించగలదు. ఇది సైబర్ సెక్యూరిటీని పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్వాంటం టెక్నాలజీ సాధారణ ఎన్‌క్రిప్షన్ పద్ధతులను బలహీనపరుస్తుంది. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పెద్ద సమస్యలని సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలు ఈ కొత్త ప్రాతిపదికను అర్థం చేసుకోడానికి, తమ డేటా భద్రతా వ్యూహాలను పునఃతయారు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
ఉత్పాదక AI
ఉత్పాదక కృత్రిమ మేధస్సు డేటాలోని నమూనాలను పరిగణనలోకి తీసుకొని వినియోగదారుల ప్రాంప్ట్‌లకు అనుగుణంగా సృజనాత్మక కంటెంట్‌ను రూపొందించడం ప్రారంభిస్తుంది. అయితే ఈ సాంకేతికత కొత్త చట్టపరమైన ప్రశ్నలను కూడా తీసుకొస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ యంత్రాలు సృష్టించిన కంటెంట్‌కి యాజమాన్యం ఎక్కడి నుంచి వస్తుంది, అందుకు సంబంధించిన చట్టాలు ఎలా ఉంటాయనేది కూడా తెలియాల్సి ఉంది.
డేటా సెంటర్‌ల అభివృద్ధి
డేటా సెంటర్లు ఆధునిక డిజిటల్ ప్రపంచానికి వెన్నెముక అని చెప్పవచ్చు. అయితే క్లౌడ్ కంప్యూటింగ్ అభివృద్ధితో డేటా గోప్యత వంటి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఈ సెంటర్లు మెరుగైన శక్తిని వినియోగిస్తున్నా, ఎక్కువ కర్బన ఉద్గారాలను వెలువరించడం వల్ల కొత్త చట్టపరమైన నియమాలు అవసరం అవుతున్నాయి. దీంతోపాటు అంతర్జాతీయ డేటా రక్షణ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారస్తులు జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
రోబోటిక్స్
రోబోటిక్స్ క్రమంగా మరింత స్వతంత్రంగా మారుతున్నాయి. వీటి ఉపయోగం, బాధ్యతలను చాకచక్యంగా వినియోగించటం వరకు సరిగానే ఉంది. కానీ నైతికత విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి. రోబోట్ పనిచేయకపోతే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలు అత్యంత కీలకమైనవి. న్యాయ వ్యవస్థలో సరైన మార్గనిర్దేశం చేస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో వీటి వాడకం, బాధ్యత, నైతికతపై చట్టపరమైన ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆటోమేటిక్ కార్లు
ఆటోమేటిక్ కార్లు (డ్రైవర్ రహిత కార్లు) రవాణా రంగంలో గొప్ప మార్పులు తీసుకొస్తాయని చెప్పవచ్చు. డ్రైవర్ లేకుండా సెన్సార్ సాయంతో అనేక దేశాల్లో వీటి వాడకం ఇప్పటికే మొదలైంది. కానీ ఏదైనా యాక్సిడెంట్ వంటివి జరిగినప్పుడు వీటితో న్యాయ సమస్యలు, చట్టపరమైన బాధ్యతలు, బీమా అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆయా సంస్థలు ఈ భద్రతా ప్రమాణాల గురించి మరింతగా స్పష్టం చేయాలి. తద్వారా వీటి వినియోగం సురక్షితంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ChatGPT: వినియోగదారుల కోసం చాట్‌జీపీటీ నుంచి వీడియో ఇంటరాక్షన్ ఫీచర్
WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..
Smart Phone Tips: మీ మొబైల్ విషయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
For More Technology News and Telugu News