Share News

Panzer Bike: ప్రపంచంలోనే అత్యంత బరువైన బైక్.. దీనిని ఎలా నడపాలంటే..!

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:38 AM

మీరిప్పటిదాకా ఎన్నో రకాల సొగసైన, శక్తిమంతమైన బైకులను చూసుకుంటారు. కానీ ఇలాంటి బాహుబలి బైకును ఇంతకు ముందు ఎక్కడా, ఎన్నడూ చూసుండరు. ఎందుకంటే... సోవియట్‌ యుద్ధ ట్యాంకర్‌ ఇంజను అమర్చిన ఈ బైకు బరువు ఏకంగా 5 టన్నులు.

Panzer Bike: ప్రపంచంలోనే అత్యంత బరువైన బైక్.. దీనిని ఎలా నడపాలంటే..!
Panzer Bike

మీరిప్పటిదాకా ఎన్నో రకాల సొగసైన, శక్తిమంతమైన బైకులను చూసుకుంటారు. కానీ ఇలాంటి బాహుబలి బైకును ఇంతకు ముందు ఎక్కడా, ఎన్నడూ చూసుండరు. ఎందుకంటే... సోవియట్‌ యుద్ధ ట్యాంకర్‌ ఇంజను అమర్చిన ఈ బైకు బరువు ఏకంగా 5 టన్నులు. అందుకే ప్రపంచంలోనే అతి బరువైన ‘రైడబుల్‌ మోటర్‌సైకిల్‌’గా ఇది గుర్తింపు పొందింది.


5వేల టన్నులు..

సాధారణ బైక్‌పై రైడ్‌కి వెళితే మజా ఏముంటుంది? విభిన్నంగా ఉండే బైక్‌పై వెళుతుంటే దారి పొడవునా అందరూ మనల్నే చూడాలి. అప్పుడే కిక్కు అనుకున్నారు జర్మనీకి చెందిన సోదరులు టిలో, విల్‌ఫ్రెడ్‌ నిబెల్‌. వారి ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ బాహుబలి బైక్‌. ‘పాంజర్‌ బైక్‌’గా పిలుస్తున్న ఈ వాహనానికి సోవియట్‌ టి-55 యుద్ధ ట్యాంక్‌ ఇంజనును అమర్చారు. ఈ ఇంజను సామర్థ్యం 35 వేల సి.సి. వెల్డింగ్‌, వాహనాల రిపేర్‌ షాపు నిర్వహించే ఈ సోదరులు కొన్ని వాహనాల నుంచి తీసిన పాత సామానును తుక్కు కింద అమ్మేయకుండా బైక్‌ తయారీలో ఉపయోగించారు. దీని తయారీ కోసం ఉపయోగించిన విడిభాగాలలో ఎక్కువ శాతం సోవియట్‌ యుద్ధ ట్యాంకుల నుంచి తీసుకున్నవే ఉన్నాయి. ఈ బైక్‌ పూర్తి కావడానికి సోదరులిద్దరూ మూడేళ్ల పాటు అహోరాత్రులు శ్రమించారు. 120 కిలోల వెల్డింగ్‌ వైర్‌ని ఉపయోగించారు. జర్మనీకి చెందిన పాంజర్‌ ట్యాంకు స్ఫూర్తితో మోటర్‌సైకిల్‌కు ‘పాంజర్‌ బైక్‌’ అని పేరు పెట్టారు. ఈ బైక్‌ని నడపాలంటే ఒక్కరివల్ల కాదు... ఇద్దరు కచ్చితంగా ఉండాల్సిందే. అత్యంత బరువైన మోటర్‌సైకిల్‌గా ఇది ఇప్పటికే ‘గిన్నిస్‌ బుక్‌’లో స్థానం సంపాదించింది.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News

Updated Date - Jun 30 , 2024 | 10:38 AM