Share News

Google: హమయ్యా.. ఆ సమస్య పరిష్కరించిన గూగుల్.. ఫేక్ యాప్‌లు తెలుసుకోవడం ఇక ఈజీ

ABN , Publish Date - May 04 , 2024 | 11:09 AM

గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.

Google: హమయ్యా.. ఆ సమస్య పరిష్కరించిన గూగుల్.. ఫేక్ యాప్‌లు తెలుసుకోవడం ఇక ఈజీ

న్యూయార్క్: డిజిటల్ యుగంలో సైబర్ క్రైం(Cyber Crimes) కేసులను నిత్యం చూస్తూనే ఉన్నాం. అనుకోకుండా ఏదైనా లింక్‌పై క్లిక్ చేస్తే ఇక అంతే.. మన వ్యక్తిగత సమచారం అంగడి సరకులా మారిపోతుంది. ఇక యాప్‌ల విషయమైతే వేరే చెప్పనక్కర్లేదు. ఏ యాప్‌ని వాడితే ఏ సమస్య ఎదురవుతుందో తెలియని పరిస్థితి. ఒరిజినల్ యాప్‌కి పోటీగా డూప్ యాప్‌లు ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.

ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లకైతే ఈ సమస్య మరీ ఎక్కువ. ఫేక్ యాప్ చూడటానికి అఫిషియల్‌గానే ఉన్నా.. దాన్ని ఇన్‌స్టాల్ చేసి పర్మిషలన్నింటికీ ఓకే చెప్పగానే.. సైబర్ నేరగాళ్లకి సమాచారం చేరిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే గూగుల్(Google) ముందడుగేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.


ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది. అందులో "Play verified this app is affiliated with a government entity" అనే పాప్‌అప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని బట్టి సదరు యాప్ కేంద్రానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా లేదా ఫేక్ యాపా అనేది తెలుసుకోవచ్చు. ఆ పాప్ అప్ రాలేదంటే అది ఫేక్ యాప్ అని అర్థం. గూగుల్ ఈ ఫీచర్‌ని ఇది వరకే 14 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది.

ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, జపాన్, సౌత్ కొరియా, అమెరికా, బ్రెజిల్, ఇండోనేసియా, మెక్సికో తదితర దేశాల్లో ఇప్పటికే ఫీచర్ ఉంది. తాజాగా భారత్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2000 యాప్‌లకుపైగా ఈ లేబుల్ ఉంది. గూగుల్ 2023 నవంబర్‌లో యాప్ డెవలపర్‌లకు కొత్త రూల్స్ ప్రకటించేముందే లేబుల్ ఫీచర్‌ని పరీక్షించింది.


విచ్చలవిడిగా నకిలీ యాప్‌లు..

భారత్‌లో ప్రభుత్వాలకు సంబంధించిన నకిలీ యాప్‌లు విచ్చలవిడిగా క్రియేట్ చేస్తున్నారు. వీటివల్ల చాలా మంది మోసపోతున్నారు.తప్పుదోవ పట్టించే యాప్‌లకు అడ్డుకట్టవేయడానికి గూగుల్ ప్లే స్టోర్ నిబంధనలను తీసుకొచ్చింది. సరైన గుర్తింపు లేని అనుమానిత యాప్‌లను గూగుల్ తమ రూల్స్ వ్యతిరేకమైనవిగా పరిగణిస్తూ సదరు యాప్‌లపై చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా గూగుల్.. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుని.. సర్టిఫైడ్ యాప్‌లకు బడ్జ్‌లు అందజేస్తోంది.

For Latest News and National News click here

Updated Date - May 04 , 2024 | 11:30 AM