Home » Google Play
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. గూగుల్ తన వార్షిక ‘గూగుల్ ఫర్ ఇండియా 2024’ ఈవెంట్‌ను అక్టోబర్ 3న నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ Android, AI, Google అసిస్టెంట్ సహా కీలక సేవల గురించి ప్రకటనలు చేసే అవకాశం ఉంది.
డెస్క్‌టాప్ కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడేవారు జాగ్రత్తగా ఉండాలని భారత ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్)’ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
ప్రస్తుతం దాదాపు అనేక మంది ప్రజలు ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి వెంటనే గూగుల్లో(google) సెర్చ్ చేస్తారు. దీంతో గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్‌గా మారిపోయింది. అలాంటి ఈ సంస్థ ప్రతి నిమిషానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా మీకు. తెలియదా అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
గూగుల్ హెల్త్ కనెక్ట్‌తో ఆరోగ్య సంబంధ డేటాను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉపయోగించు కోవచ్చు. ఇష్టమైన హెల్త్ యాప్‌లతో అనుసంధానం అయ్యేందుకు ఇది తోడ్పడుతుంది. అవసరమైన హెల్త్ డేటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీంతో పొందవచ్చు. నిజానికి వివిధ హెల్త్ ఫిట్‌నెస్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరించుకోవడం సమస్యే. అయితే గూగుల్ అందుకు పరిష్కారంగా గూగుల్ హెల్త్ కనెక్ట్‌కు రూపకల్పన చేసింది.
గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. అదే యాప్ లేబుల్ ఫీచర్. ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. ప్లే స్టోర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాప్‌ని(Apps) డౌన్‌లోడ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసే ముందు ఓ లేబుల్ వస్తుంది.
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తన ప్లే స్టోర్ (Google Play Store) నుంచి భారత్‌కు చెందిన కొన్ని యాప్‌లను (Indian Apps) తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. సర్వీస్ ఫీజు వివాదం నేపథ్యంలో.. శుక్రవారం భారత్ మ్యాట్రిమోనీ (Bharat Matrimony), నౌక్రీతో (Naukri) పాటు పది కంపెనీలకు చెందిన యాప్‌లను తీసేసింది.
రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడుతున్న వారికి టెక్ దిగ్గజం గూగుల్ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్ నుంచి రియల్ మనీ గేమింగ్ యాప్స్ వాడకంపై సర్వీస్ ఛార్జీలు విధించాలని యోచిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. డైలీ ఫాంటసీ, రమ్మీతోపాటు పలు గేమింగ్ యాప్స్‌పై ఈ ఛార్జీలు ఉంటాయని తెలిపింది. ఇక భారత్, మెక్సికో, బ్రెజిల్ దేశాలలో ఈ ఏడాది జూన్ నుంచి ‘గూగుల్ ప్లే స్టోర్’పై మరిన్ని రకాల రియల్ మనీ గేమింగ్ యాప్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
వినియోగదారుల భద్రతను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్న 18 లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. వాటిల్లో చాలా వరకు కోటికి పైగా డౌన్ లోడ్స్ ఉన్నవే కావడం గమనార్హం. వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు.
ఉప్పు నుంచి పప్పు దాకా, రూపాయి నుంచి వేల రూపాయల ట్రాన్సక్షన్ వరకూ ఏది చేయాలన్నా... ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం వంటి యాప్‌ల ద్వారానే చేయడం సర్వసాధారణమైంది. యూజర్లను ఆకట్టుకునేందుకు సదరు యాప్‌ల అనేక ఆఫర్లు కూడా ఇస్తుంటారు. కొన్నిసార్లు...
గూగుల్ క్రోమ్ (Google Chrome) వినియోగదారులకు భారత ప్రభుత్వం (Indian Government) తాజాగా హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది.