Share News

Smartphones in June 2024: ఈ నెలలో మార్కెట్‌లోకి రాబోతున్న అదిరిపోయే ఫోన్లు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:04 PM

రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్త మోడల్‌ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.

Smartphones in June 2024: ఈ నెలలో మార్కెట్‌లోకి రాబోతున్న అదిరిపోయే ఫోన్లు!

రాబోయే వారంలో పలు కంపెనీల కొత్త ఫోన్లు మార్కెట్లో సందడి చేయబోతున్నాయి. జూన్ 17 నుంచి జూన్ 23 మధ్య తేదీల్లో పలు కంపెనీలు వరుసగా ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. మోటరోలా, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి కొత్త మోడల్‌ ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి.

కొత్త ఫోన్లు కొనడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లను పరిశీలించవచ్చు. ఆ ఫోన్లకు సంబంధించిన వివరాలను పరిశీలిద్దాం...


వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ4 లైట్

వన్‌ప్లస్ నుంచి నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో జూన్ 18న విడుదల కాబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు అందుబాటులోకి రాలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 లోపు ఉండొచ్చని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్ ద్వారా పనిచేయనుందని, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సుమారు 80వాట్స్, 5500ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రధాన ఫీచర్లతో మార్కెట్‌లోకి రావొచ్చని అంచనాగా ఉంది.


మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా

మోటరోలా కంపెనీ జూన్ 18న సరికొత్త ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను భారత విపణిలో విడుదల చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది. అదే రోజున కంపెనీ రెండు ఫోన్లు విడుదల చేయనుండగా అందులో ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ఒకటిగా ఉంది. దీని ధర రూ.50,000 వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పనిచేయనుంది. ఫొటోగ్రఫీ కోసం 50ఎంపీ ప్రధాన కెమరా, 144హెట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో డిస్‌ప్లే, 4500 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ, 125వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది.


రియల్‌మీ నుంచి జీటీ 6

రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోంది. చక్కటి గేమింగ్ సామర్థ్యంతో జూన్ 20న సరికొత్త ‘రియల్‌మీ జీటీ 6’ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడదుల చేయనుంది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. మొబైల్ ఫోటోగ్రఫీ కోసం 50ఎంపీ ఫ్రంట్ కెమెరా, వెనుకాల ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరాను ప్రత్యేకంగా అందించారు. 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

Updated Date - Jun 16 , 2024 | 04:07 PM