Display Replacement: ఈ వినియోగదారులకు ఫ్రీ డిస్‌ప్లే రీప్లేస్‌మెంట్.. క్రేజీ ఆఫర్ ప్రకటించిన సంస్థ..
ABN , Publish Date - Aug 01 , 2024 | 07:57 PM
భారతీయ వినియోగదారుల కోసం ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్(OnePlus) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నట్లు తెలిపింది. గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
భారతీయ వినియోగదారుల కోసం ప్రముఖ మొబైల్(smart phone) ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్(OnePlus) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు జీవిత కాలం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించనున్నట్లు తెలిపింది. గ్రీన్‌లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఈ సమస్య ఉన్న ఫోన్లకు శామ్ సంగ్ కూడా వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సౌకర్యం ఇచ్చింది. గ్రీన్ లైన్ సమస్య ముఖ్యంగా AMOLED స్క్రీన్‌లలో కనిపిస్తుంది. గ్రీన్ లైన్ స్క్రీన్ సమస్య గురించి వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ ఆఫర్ ప్రకటించారు. ఈ సమస్య పాత AMOLED డిస్ప్లేలలో కనిపిస్తుంది.
అర్హత కలిగిన
OnePlus వెబ్‌సైట్ ప్రకారం ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ఆఫర్ జూలై 23, 2024 నుంచి ఆగస్టు 1, 2029 వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో వినియోగదారులు OnePlus 8 Pro, OnePlus 8T, OnePlus 9, OnePlus 9R స్మార్ట్‌ఫోన్‌ల స్క్రీన్‌ను ఉచితంగా మార్పు చేసుకోవచ్చు. ఈ క్రమంలో OnePlus స్క్రీన్ ఉచితంగా అందిస్తారు. OnePlus ప్రస్తుతం భారతీయ వినియోగదారులకు మాత్రమే రెడ్ కేబుల్ బెనిఫిట్స్ క్రింద ఈ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే అర్హత కలిగిన వ్యక్తుల ఫోన్లు తప్పనిసరిగా ఎటువంటి నష్టం, మరమ్మతులు లేకుండా ఉండాలని తెలిపింది. భారతదేశంలోని వ్యక్తులు ఈ ఆఫర్‌ను వారి OnePlus ఫోన్ సెట్టింగ్‌ల విభాగంలో రెడ్ కేబుల్ క్లబ్ విభాగంలో గుర్తించవచ్చు.
OnePlus స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
దీని కోసం ముందుగా మీరు OnePlus రెడ్ కేబుల్ ఖాతాను కలిగి ఉండాలి. మీ రెడ్ కేబుల్ ఖాతాకు లాగిన్ చేసిన తర్వాత, మీరు ఈ జాబితా చేయబడిన మోడల్‌లను ఎంచుకోవాలి
మీరు మీ రెడ్ కేబుల్ ఖాతాకు లాగిన్ కానట్లయితే, మీరు మీ ఫోన్ IMEI నంబర్‌ను నమోదు చేయండి
మీ ఫోన్ పెట్టెపై IMEI నంబర్ లేదా మీ ఫోన్‌లో *#06# డయల్ చేయడం ద్వారా మీరు IMEI నంబర్‌ను కనుగొనవచ్చు
ఆ తర్వాత మీ సమీపంలోని సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి టైమ్ స్లాట్‌ను ఎంచుకోండి
దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఫారమ్‌ను సమర్పించండి
ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, మీరు మీ అపాయింట్‌మెంట్ నిర్ధారణను పొందుతారు
ఆ తర్వాత మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను సర్వీస్ సెంటర్ వారి నుంచి ఉచితంగా పొందుతారు
ఇవి కూడా చదవండి:
Trending Stock: ఇన్వెస్టర్ల పంట పండింది.. ఏడాదిలో 77% లాభాలను ఇచ్చిన షేర్లు..
Zomato: పుంజుకున్న జొమాటో.. రూ.2 కోట్ల నుంచి రూ.253 కోట్లకు..
Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..
For More Technology News and Telugu News..