Share News

ChatGPT: చాట్‌ జీపీటీలో సమస్యలు.. ఆందోళనలో వినియోగదారులు

ABN , Publish Date - Nov 09 , 2024 | 09:44 AM

టెక్ ప్రియులకు ఆటంకం ఏర్పడింది. ఆకస్మాత్తుగా చాట్‌బాట్ ChatGPTని ఉపయోగించడంలో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ స్పందించింది.

ChatGPT: చాట్‌ జీపీటీలో సమస్యలు.. ఆందోళనలో వినియోగదారులు
chatbot ChatGPT services issue

ప్రస్తుత టెక్ ప్రపంచంలో చాట్‌ జీపీటీ గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఏదైనా విషయం కోసం టైప్ చేయాలన్నా, దేని గురించైనా తెలుసుకోవాలన్నా కూడా దీనిలోనే సెర్చ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ క్షణాల్లో సమాచారం అందిస్తుండటంతో అనేక మంది దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈరోజు మాత్రం అనేక మంది వినియోగదారులను ChatGPT ఇబ్బంది పెట్టింది. ఏమైందంటే చాట్‌బాట్ ChatGPTని ఉపయోగించడంలో నేడు అనేక మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా ఇది పనిచేయకుండా ఆగిపోయింది.


సమస్య ఎప్పుడు

మైక్రోసాఫ్ట్ OpenAI శుక్రవారం రాత్రి ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఈ కారణంగా చాట్‌బాట్ ChatGPT ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. దీనిపై స్పందించిన సంస్థ సమస్యను పరిశోధిస్తున్నామని తెలిపింది. వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని కంపెనీ తన వెబ్‌సైట్‌లో ప్రకటింది. Downdetector.com ప్రకారం 7:13 p.m. (శనివారం 0013 GMT) నాటికి 19,403 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఈ సమస్యతో ప్రభావితమయ్యారు.


ChatGPT అంటే ఏంటి?

ChatGPT అనేది ఏఐ ఆధారిత మెషిన్ లెర్నింగ్ చాట్ బాట్. చాట్ GPT యొక్క పూర్తి రూపం చాట్ జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్. దీన్ని అభివృద్ధి చేసిన కంపెనీ పేరు ఓపెన్ ఏఐ. ఇది వినియోగదారు అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకుని పూర్తి వివరాలతో సమాధానాన్ని సిద్ధం చేసి అందజేస్తుంది.


చాట్ GPT ప్రత్యేకత ఏమిటి?

Chat GPT నవంబర్ 30, 2022న ప్రారంభించబడింది. GPT వంటి చాట్ బాట్‌లు పెద్ద మొత్తంలో డేటా, కంప్యూటింగ్ టెక్నాలజీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తాయి. పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా, పదాలను సరైన సందర్భంలో ఉపయోగిస్తుంది. Google, Metaతో సహా ఇతర సాంకేతిక సంస్థలు కూడా ఇటువంటి ప్రోగ్రామ్‌లను ఉపయోగించి ప్రశ్నలకు సమాధానమిచ్చే నమూనాలను అభివృద్ధి చేశాయి. అదే సమయంలో ఓపెన్ AI ద్వారా అభివృద్ధి చేయబడిన చాట్ GPT ఇంటర్‌ఫేస్ సాధారణ ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటుంది.


Google, ChatGPTకి ఎంత తేడా ఉందా?

అయితే Google, Chat GPT మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడితే Google కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే. శోధించినప్పుడు ఇది ఫలితాల లింక్‌లను వినియోగదారు ముందు ఉంచుతుంది. అదే సమయంలో చాట్ GPT AI ద్వారా వినియోగదారు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని మొత్తం సిద్ధం చేసి టెక్స్ట్ రూపంలో అందజేస్తుంది.

చాట్ GPTని ఏదైనా ప్రశ్న అడగవచ్చు. ఇది ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. AI ప్రోగ్రామ్ Chat GPT వినియోగదారు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందారా లేదా అని అడుగుతుంది. ‘నో’ను ఎంచుకున్నప్పుడు, Chat GPT దాని డేటాను మార్చి కొత్త డేటాను అందిస్తుంది. వినియోగదారులు అందించిన సమాచారంతో సంతృప్తి చెందే వరకు ఇది పదేపదే దాని ఫలితాలను మార్చుతూ ఇవ్వడం విశేషం.


ఇవి కూడా చదవండి:

Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...


WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Gmail Scam: జీమెయిల్ ఖాతా రికవరీ చేస్తామంటూ కేటుగాళ్ల స్కాం


Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Nov 09 , 2024 | 09:46 AM