Share News

WhatsApp: ఇకపై 60 సెకన్లు.. ఈ వాట్సప్ అప్‌డేట్ సూపర్ గురూ...

ABN , Publish Date - May 30 , 2024 | 12:53 PM

విభిన్న అప్‌డేట్లతో ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకుంటున్న వాట్సప్(WhatsApp) ఇప్పుడు మరో అప్‌డేట్‌తో వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్టేటస్‌ నిడివిని ఒక నిమిషానికి పెంచిన వాట్సప్.. తాజాగా వాట్సప్ స్టేటస్ వాయిస్ నిడివిని కూడా నిమిషానికి పెంచింది.

WhatsApp: ఇకపై 60 సెకన్లు.. ఈ వాట్సప్ అప్‌డేట్ సూపర్ గురూ...

ఇంటర్నెట్ డెస్క్: విభిన్న అప్‌డేట్లతో ఎప్పటికప్పుడు వినూత్నతను చాటుకుంటున్న వాట్సప్(WhatsApp) ఇప్పుడు మరో అప్‌డేట్‌తో వచ్చింది. ఇప్పటికే వాట్సప్ స్టేటస్‌ నిడివిని ఒక నిమిషానికి పెంచిన వాట్సప్.. తాజాగా వాట్సప్ స్టేటస్ వాయిస్ నిడివిని కూడా నిమిషానికి పెంచింది.

ఇంతకాలం 30 సెకన్లకే పరిమితమైనా వాయిస్ నోట్‌ను ఇకపై నిమిషం పాటు రికార్డ్ చేసి స్టేటస్‌గా పెట్టవచ్చు. వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకే అప్‌డేట్ తీసుకొచ్చినట్లు మెటా తెలిపింది.


వాయిస్ నోట్ ఫీచర్ ప్రత్యేకత..

వాట్సప్ స్టేటస్‌పై వాయిస్‌తో కూడిన ఫోటోలు, టెక్స్ట్, వీడియోల మాదిరిగానే వాయిస్ నోట్స్ రూపంలో అప్‌డేట్‌లను షేర్ చేయడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుంది. వాయిస్ పరిమితిని 30 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు పొడిగించడం ద్వారా వాట్సప్ వినియోగదారులు ఒకే స్టేటస్ అప్‌డేట్‌లో ఎక్కువ మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. సుదీర్ఘ వివరణాత్మక విషయాలు లేదా కథనాలను వినిపించాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. WABetaInfo నివేదిక ప్రకారం, లాంగ్-ఫార్మాట్ వాయిస్ నోట్ స్టేటస్ ఫీచర్ ప్రస్తుతం Android, iOS ప్లాట్‌ఫారమ్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, వినియోగదారులు తమ WhatsAppని తాజా వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలి.


లాంగ్ ఫార్మెట్ వాయిస్ నోట్స్ పోస్ట్ చేయండిలా..

  • వాట్సప్‌ను అప్‌డేట్ చేయండి

  • తరువాత వాట్సప్‌ని ఓపెన్ చేయండి.

  • అప్‌డేట్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • కింది వైపు కుడి కార్నర్‌లో పెన్ టూల్ కనిపిస్తుంది దానిపై నొక్కండి.

  • అది నేరుగా స్టేటస్ బార్‌లోకి నేవిగేట్ చేస్తుంది. అక్కడ మైక్రోఫోన్ ఆప్షన్‌పై లాంగ్ ప్రెస్ చేసి మీరు చెప్పాలనుకునే విషయాన్ని నిమిషంపాటు రికార్డ్ చేయండి.

  • తరువాత స్టేటస్‌గా పెట్టేయండి.

For more Latest News and Technology News click here

Updated Date - May 30 , 2024 | 12:53 PM