Share News

Meta: సరికొత్త ఫీచర్‌తో వాట్సప్.. చాట్ బ్యాకప్ కోసం కుస్తీలక్కర్లేదు

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:04 AM

కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.

Meta: సరికొత్త ఫీచర్‌తో వాట్సప్.. చాట్ బ్యాకప్ కోసం కుస్తీలక్కర్లేదు

ఇంటర్నెట్ డెస్క్: కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సప్ ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ(WhatsApp Transfer Chat History) అనే ఫీచర్‌ని పరిచయం చేయనుంది.


దీని ద్వారా యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలపింగ్ స్టేజ్‌లో ఉండగా.. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.


ప్రస్తుతం...

యూజర్లు ప్రస్తుతం వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్‌లో చాట్ హిస్టరీ పొందేవారు. అయితే ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా కేవలం ఒకే ఒక్క స్కాన్ తో చాట్ హిస్టరీని బదిలీ చేసేందుకు ఫీచర్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా క్లౌడ్ బ్యాకప్‌ను బైపాస్ చేసి, మరో ఫోన్‌లోకి చాట్ హిస్టరీని పంపుతుంది.


అయితే ఇది ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన రెండు ఫోన్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఉదాహరణకు ఐఫోన్ ఉంటే మరొక ఐఫోన్‌కి మారాలనుకున్నప్పుడు.. కొత్త ఐఫోన్‌తో పాత ఐఫోన్ లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ హిస్టరీ వస్తుంది. ఇదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో కూడా చాట్‌ని బదిలీ చేయవచ్చు.వాట్సాప్ ఈ ఫీచర్‌ విడుదల తేదీని కచ్చితంగా ప్రకటించలేదు.త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 13 , 2024 | 11:04 AM