WhatsApp: వాట్సప్‌లో అందుబాటులోకి ఏఐ చాట్‌బాట్ ఫీచర్.. ఇలా చెక్ చేసుకోండి
ABN , Publish Date - Apr 11 , 2024 | 06:24 PM
వాట్సప్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఏఐ చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ Meta AI చాట్‌బాట్‌ను తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్‌కు తీసుకువస్తుంది. అయితే ఈ Meta AI ఐకాన్ భారత్‌లోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: వాట్సప్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఏఐ చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ Meta AI చాట్‌బాట్‌ను తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్‌కు తీసుకువస్తుంది. అయితే ఈ Meta AI ఐకాన్ భారత్‌లోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఏఐ (లామా) ఆధారంగా రూపొందించారు. ఇది వాట్సాప్ వినియోగదారులకు ఏదైనా సంభాషణలను ఎనేబుల్ చేస్తుంది. ప్రస్తుతానికి గాడ్జెట్ 360 డివైజ్ కలిగిన వారికి ఈ ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
ఈ ఫీచర్ ఇంటర్‌ఫేస్‌ని కొందరు స్క్రీన్‌షాట్ తీసి పంపారు. అందులోని వివరాల ప్రకారం.. Meta AI చాట్ ధృవీకరించబడిన బ్యాడ్జ్‌తో తెరవబడుతుంది. "#with Llama#" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ప్రదర్శిస్తుంది. చాట్ పాప్-అప్.. మెటా AIని ఏదైనా అడగమని వినియోగదారులను కోరుతుంది. అందులో కొన్ని.. "మార్స్‌పై కారు రేసును ఊహించుకోండి", "హోలోగ్రాఫిక్ బస్సును ఊహించుకోండి", "ఆరోగ్యకరమైన జీవిత లక్ష్యాలు" వంటి ఆప్షన్లు చూపిస్తుంది. కెమెరా, కొత్త చాట్ ఎంపికలతో పాటుగా స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో Meta AI ఐకాన్‌ని చూడవచ్చు.
High Court: భర్తకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే.. భార్యను ఆదేశించిన హైకోర్టు
Microsoftకి చెందిన Cortana అసిస్టెంట్‌ని ఇది పోలి ఉంటుంది. Meta AI ఫీచర్ ప్రస్తుతం కొన్ని దేశాలలో అదీ.. ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. Meta AIతో చాట్ సంభాషణను ప్రారంభించేటప్పుడు మీరు ఏఐ చాట్‌బాట్‌కి ఇచ్చే సూచనల ఆధారంగా.. అక్కడ సమాధానాలు వస్తాయి. ఇది కేవలం @MetaAI అని పేర్కొన్న చాట్‌లను మాత్రమే చదవగలదని, వాటికి ప్రత్యుత్తరం ఇవ్వగలదని తెలుస్తోంది. ఈ ఫీచర్‌కు ఎప్పటిలాగే, మీ వ్యక్తిగత సందేశాలు, కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటాయి. అంటే WhatsApp లేదా Meta కూడా వాటిని చూడలేవు, వినలేవు.
ఈ ఫీచర్ వచ్చిన వారు మెటా ఏఐతో చాట్ చేయాలనుకుంటే..
1: WhatsAppలో Meta AI ఫీచర్‌తో చాట్‌ని ప్రారంభించడానికి, వాట్సప్‌లోని ప్రధాన చాట్ టాప్ రైట్‌లో ఉన్న వృత్తాకార చిహ్నంపై నొక్కండి.
2: తర్వాత, నిబంధనలను చదవి, ఆమోదించండి. స్క్రీన్ నుంచి సూచించబడిన ప్రాంప్ట్‌ను ఎంచుకోండి లేదా సొంతంగా టైప్ చేయండి. సంభాషణను ప్రారంభించడానికి సెండ్ బటన్ నొక్కండి.
మెటా AI ఫీచర్‌పై వినియోగదారుల నుంచి వాట్సాప్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. వినియోగదారులు AI రూపొందించిన ప్రతిస్పందనలను నొక్కి పట్టుకుని, కారణాన్ని టైప్ చేసి సమర్పించేటప్పుడు 'మంచి స్పందన' లేదా 'చెడు ప్రతిస్పందన' ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి