Share News

WhatsApp Alert: ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ పని చేయదు..!

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:54 PM

WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో..

WhatsApp Alert: ఈ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ పని చేయదు..!
WhatsApp Updates

WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్స్, ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో, అధునాత టెక్నాలజీతో కూడిన మొబైల్స్‌ని మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటారు. ఇందుకు అగునుణంగానే.. మేటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు పాత ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్‌లను వదిలించుకుంటుంది. పాత వెర్షన్ స్మార్ట్‌ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయకుండా నిలిపివేస్తుంది. తాజాగా ఇలాంటి నిర్ణయాన్నే ప్రకటించింది వాట్సాప్.


తాజా సమాచారం ప్రకారం.. ఆండ్రాయిడ్ 4, దానికంటే పాత వెర్షన్.. iOS 11, అంతకంటే పాత వెర్షన్.. Kai OS 2.4, అంతకంటే పాత వెర్షన్‌ ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. మొత్తం 35 స్మార్ట్ ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సపోర్ట్ చేయబోదని కంపెనీ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 5, ఆపై వెర్షన్‌లలో, iOS 11, ఆపై వెర్షన్‌లో వాట్సాప్ సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. వాట్సాప్ తాజా ప్రకటన ప్రకారం.. ఏయే మోడల్ మొబైల్స్‌లో వాట్సాప్ పనిచేయదో నిపుణులు అంచనా వేసి చెప్పారు. వాటిలో యాపిల్, సామ్‌సంగ్, హువాయి, మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి.


ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి..!

  • Samsung Galaxy Ace Plus

  • Samsung Galaxy Core

  • Samsung Galaxy Express 2

  • Samsung Galaxy Grand

  • Samsung Galaxy Note 3 N9005 LTE

  • Samsung Galaxy Note 3 Neo LTE+

  • Samsung Galaxy S 19500

  • Samsung Galaxy S3 Mini VE

  • Samsung Galaxy S4 Active

  • Samsung Galaxy S4 Mini I9190

  • Samsung Galaxy S4 Mini I9192 Duos

  • Samsung Galaxy S4 Mini I9195 LTE

  • Samsung Galaxy S4 Zoom


  • Apple iPhone 5

  • Apple iPhone 6

  • Apple iPhone 6S Plus

  • Apple iPhone 6S

  • Apple iPhone SE

  • Huawei C199

  • Huawei GX1s

  • Huawei Y625

  • Ascend P6 S

  • Ascend G525

గమనిక: పైన పేర్కొన్న మొబైల్స్ వివరాలు కెనాల్‌టెక్‌లో ప్రచురించిన కథనం మేరకు ఇవ్వడం జరిగింది.


Also Read:

సెమీస్ చేరిన భారత హాకీ జట్టు.. అడుగు దూరంలో పతకం

వల్లభనేని వంశీ ఏమయ్యాడు..!?

విశాఖ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

For More Tech News and Telugu News..

Updated Date - Aug 04 , 2024 | 03:54 PM