Share News

Youtube Shorts: యూట్యూబ్ నుంచి కీలక అప్‌డేట్.. ఇకపై షార్ట్ వీడియోల టైం

ABN , Publish Date - Oct 04 , 2024 | 03:11 PM

యూట్యూబ్ క్రియేటర్లకు మరో అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది. గత అనేక నెలలుగా షార్ట్ వీడియోల టైం పరిమితిని పెంచాలని చేసిన విజ్ఞప్తుల మేరకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏం ప్రకటించారనేది ఇక్కడ చుద్దాం.

Youtube Shorts: యూట్యూబ్ నుంచి కీలక అప్‌డేట్.. ఇకపై షార్ట్ వీడియోల టైం
YouTubers short videos update

యూట్యూబ్(Youtube) ఎప్పటికప్పుడు పలు రకాల మార్పులు, అప్‌డేట్‌లను తీసుకువస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నిరోజుల క్రితం YouTube AI ఫీచర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే తాజాగా యూట్యూబ్ మరో కొత్త ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇప్పుడు షార్ట్ వీడియో సృష్టికర్తలు గరిష్టంగా 3 నిమిషాల వరకు చిన్న వీడియోలను సృష్టించుకుని అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం 59 సెకన్ల నిడివి గల వీడియోలు మాత్రమే అప్‌లోడ్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు క్రియేటర్లు గరిష్టంగా 3 నిమిషాల షార్ట్ ఫీడ్‌ వీడియోలను ఉపయోగించుకోవచ్చు.


ఎప్పటి నుంచంటే..

ఈ మార్పు అక్టోబర్ 15, 2024 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ క్రమంలో అదనంగా కంటెంట్ పెంచుకోవడం, మరింత సరదాగా, ఆకర్షణీయంగా చేయడానికి YouTube అనేక కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది. దీంతో క్రియేటర్లు యూజర్లకు కొత్త స్టోరీలు చెప్పడానికి, వారితో మరింత కనెక్ట్ అవ్వడానికి అవకాశం కల్పిస్తుంది. గతంలో YouTube Shorts సాధారణంగా ఒక నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలపై దృష్టి పెట్టింది. ఈ చిన్న వీడియోలు టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో YouTube పోటీపడేందుకు సహాయపడింది.


రీక్రియేట్

కానీ ఇప్పుడు 3 నిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తోంది. ఈ మార్పు కారణంగా గతంలో నిమిషంలోపు వీడియోలు అప్‌లోడ్ చేసిన వీడియోలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో వినియోగదారులు పొడవైన, చిన్న వీడియోలను గుర్తించడంలో సహాయపడేందుకు YouTube సిఫార్సు చేస్తుందని వెల్లడించారు. షార్ట్‌లో ఉన్న "రీమిక్స్" బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ట్రెండింగ్ వీడియోలను సులభంగా రీమిక్స్ చేయడానికి లేదా రీక్రియేట్ చేసుకోవడానికి ఈ ఫీచర్ అనుమతిస్తుందన్నారు. ఇది క్రియేటర్‌లు ట్రెండ్‌లను అనుసరించడాన్ని సులభతరం చేస్తుందని ప్రకటించారు.


మరిన్ని అప్‌డేట్స్

దీంతోపాటు వచ్చే మరికొన్ని నెలల్లో ఇంకొన్ని అప్‌డేట్స్ రానున్నాయి. వీటిలో క్రియేటర్‌లు త్వరలో తమ సొంత షార్ట్‌లను రూపొందించుకోవడానికి మ్యూజిక్ వీడియోలతో సహా వివిధ రకాల YouTube వీడియోల నుంచి క్లిప్‌లను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో YouTube వీడియోల కోసం మరింత సృజనాత్మకతను అనుమతిస్తుంది. ఆ క్రమంలో Google DeepMind అధునాతన వీడియో మోడల్, Veo కూడా ఈ సంవత్సరం చివర్లో Shorts కోసం ఉపయోగించుకోవచ్చని అనౌన్స్ చేశారు.


వీక్షకుల కోసం

వీటి ద్వారా సృష్టికర్తలు మరింత శక్తివంతమైన వీడియోలను సృష్టించుకోవచ్చని ప్రకటించారు. ఈ క్రమంలోనే అభిమానులు, వీక్షకుల కోసం తాజా వైరల్ కంటెంట్‌తో కనెక్ట్ అయ్యేందుకు సహాయం చేయడానికి YouTube కొత్త "షార్ట్ ట్రెండ్స్" పేజీని ప్రారంభిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు నేరుగా Shorts ఫీడ్ నుంచి కామెంట్‌లలో ఏమి చెబుతున్నారనే ప్రివ్యూని చూడవచ్చు.


ఇవి కూడా చదవండి:

ChatGPT: చాట్‌జీపీటీ వినియోగదారులకు షాకింగ్ న్యూస్

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

WhatsApp Hacking: మీ వాట్సాప్ ఖాతా హ్యాకైందో లేదో ఇలా తెలుసుకోండి..

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..

For More Technology News and Telugu News

Updated Date - Oct 04 , 2024 | 03:31 PM