Share News

ATM: ఏటీఎంను తెరిచేందుకు నానా తంటాలు పడి.. చివరకు ఏం చేశారో తెలిస్తే..

ABN , Publish Date - Jul 10 , 2024 | 11:33 AM

ఏటీఎం చోరీలు జరుగుతూనే ఉంటాయి. ఇది మాత్రం కొంత స్పెషల్. దొంగలు ఈ మధ్య ఇళ్లనే కాదండోయ్.. ఏటీఎం సెంటర్లను సైతం టార్గెట్ చేస్తున్నారు. వెదుక్కునే పని లేకుండా ఏటీఎం పగుల కొడితే చాలు..

ATM: ఏటీఎంను తెరిచేందుకు నానా తంటాలు పడి.. చివరకు ఏం చేశారో తెలిస్తే..

కామారెడ్డి: ఏటీఎం చోరీలు జరుగుతూనే ఉంటాయి. ఇది మాత్రం కొంత స్పెషల్. దొంగలు ఈ మధ్య ఇళ్లనే కాదండోయ్.. ఏటీఎం సెంటర్లను సైతం టార్గెట్ చేస్తున్నారు. వెదుక్కునే పని లేకుండా ఏటీఎం పగుల కొడితే చాలు.. డబ్బు పట్టుకుని ఎంచక్కా చెక్కేయవచ్చని. తాజాగా నలుగురు దొంగలు ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్‌ను పగుల కొట్టేందుకు శత విధాలుగా యత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. ఇక అంతే వారి మెదడులోకి ఓ ఐడియా రివ్వున దూసుకొచ్చింది. పగుల గొట్టేందుకు టైమ్ వేస్ట్ ఎందుకనుకున్నారో ఏమో.. ఏటీఎం మెషీన్‌ను వారి వాహనంలో వేసుకుని పరారయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో చోటు చేసుకుంది.


పోలీసులు, బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున నలుగురు దొంగలు క్వాలిస్ వాహనం వేసుకుని మరీ దొరల్లా బిచ్కుందకు వచ్చారు. ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి శతవిధాలుగా యత్నించారు. అయినా సరే.. ఏటీఎంను మాత్రం తెరవలేకపోయారు. దీంతో అద్దాల తలుపును బద్దలు కొట్టి మరీ ఏటీఎంను వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు. దొంగల ప్రయాసంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దొంగిలిస్తున్న సమయంలో సైరన్‌ మోగింది. వెంటనే అలర్ట్ అయిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి దొంగలు పరారయ్యారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దొంగలు బిచ్కుంద మీదుగా మహారాష్ట్ర సరిహద్దులో గుల్లకు చేరుకుని అక్కడ తమ క్వాలిస్ వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయారు. మార్గమధ్యంలో రెండు ద్విచక్ర వాహనాలను సైతం చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 11:33 AM