Share News

Children: ఆడుకుంటుండగా చిన్నారి ఏం చేసిందంటే..

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:40 AM

పాఠశాలలో ఆటలాడుకునే సమయంలో ఓ చిన్నారి తల పిల్లర్‌లో ఇరుక్కున్నది. దీంతో ఆ చిన్నారి కేకలు పెట్టింది. వెంటనే అక్కడున్న టీచర్లు పరుగుతీశారు.

Children: ఆడుకుంటుండగా చిన్నారి ఏం చేసిందంటే..
child's Head Stuck Between Pillar,

నాగర్ కర్నూలు: చిన్నారుల తలలు బిందెలో ఇరుక్కోవడం చూశాం. చాలా సందర్భాల్లో వాటిని కత్తిరించారు కూడా. ఓ విద్యార్థి తల పిల్లర్ల మధ్య ఇరుక్కొంది. కేకలు వేయడంతో టీచర్లు, స్థానికులు ఉరుకులు పరుగులు తీశారు. ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. భయపడొద్దు.. బయటకు తీస్తాం అని చెప్పారు. ఆ పిల్లర్ పైన కొంచెం కొంచెం మెల్లిగా కత్తిరించారు. అలా కాసేపు కత్తిరించి.. పిల్లర్ లో ఇరుక్కొన్న చిన్నారి తలను ఎట్టకేలకు బయటకు తీశారు.


ఎక్కడంటే..?

అచ్చంపేట మండలం పులిజాల ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఓ విద్యార్థి స్నేహితులతో ఆడుకుంటుంది. ఆ క్రమంలో దాక్కునే ప్రయత్నంలో భాగంగా.. పిల్లర్ల మధ్య తల పెట్టింది. ఆ పిల్లర్ నుంచి వెళదామని అనుకుంది.. కానీ వెళ్లడం వీలు పడలేదు. ఇంకేముంది గట్టిగా ఏడ్చింది. దీంతో ఉపాధ్యాయులు వెంటనే అక్కడికి వచ్చారు. గ్రామస్థులు కూడా గుమికూడారు. డ్రిల్లర్ మిషన్ తో పిల్లర్ పై భాగం కొంచెం, కొంచెం కోస్తూ వచ్చారు. ఆ పిల్లర్ నుంచి బయటకు వచ్చేందుకు గ్యాప్ ఏర్పడింది. అక్కడున్న కొందరు మెల్లిగా చేతులు వెనక్కి పెట్టి.. చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. హమ్మయ్యా అని ఆ చిన్నారి ఊపిరి పీల్చుకొని బయటకు వచ్చింది. అక్కడున్న వారు కూడా కాస్త రిలాక్స్ అయ్యారు.


గేమ్స్‌కు పీరియడ్

స్కూల్ లో పాఠాలతో పాటు ఆటలకు పీరియడ్ ఉంటుంది. ఆ సమయంలో చిన్నారి తల పెట్టి ఇరుక్కొని ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గేమ్స్ పీరియడ్ అయితే వారితో పీఈటీ ఎందుకు లేరని ప్రశ్నించే వారు ఉన్నారు. ఏదో జరిగింది.. ఎలాగోలా బాలిక బయటకు వచ్చిందని మరికొందరు అంటున్నారు. చిన్నారి పిల్లర్‌లో ఇరుక్కున్న వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి

TG NEWS: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. కారణమిదే

KTR: రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.. కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 11:40 AM