Share News

Telangana: ఆ జీవోను రద్దు చేయండి: హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్

ABN , Publish Date - Oct 23 , 2024 | 09:36 PM

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలను నియమించనుంది. ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అక్టోబర్ 10వ తేదీన జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

Telangana: ఆ జీవోను రద్దు చేయండి: హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్

హైదరాబాద్, అక్టోబర్ 23: ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 33 ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇందిరమ్మ కమిటీలు కాకుండా గ్రామ సచివాలయం అధికారులే లబ్ధిదారులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అక్టోబరు 11, 2024 నాటి GO Ms 33 చెల్లుబాటును సవాలు చేస్తూ మహేశ్వర్ రెడ్డి బుధవారం రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు.

Also Read: రేగు పండ్లు తింటే ఇన్ని లాభాలున్నాయా..?


రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలను నియమించనుంది. ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను అక్టోబర్ 10వ తేదీన జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.

Also Read: Maharashtra election: మహాయుతి ఓటమే మహా వికాస్ అఘాడీ లక్ష్యం


కమిటీల నియామకానికి అక్టోబర్ 11 కల్లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. అలాగే కమిటీల నియామకానికి పేర్లను పంపాలని మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించింది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్‌ లేదా పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Also Read: Ktr: కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి: కేటీఆర్


మున్సిపల్ స్థాయిలో వార్డు కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఈ రెండు కమిటీల్లో.. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, గ్రామ, మున్సిపల్ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారు. ఈ ముగ్గురిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమించాలని ఉత్తర్వుల్లో సూచించారు.

Also Read:Delhi LG: అనుమతి తీసుకోవాలని తెలియదు


కమిటీల్లో నియమించేవారి పేర్లను ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్లు కలెక్టర్లకు పంపుతారు. అనంతరం కలెక్టర్లు ఆ వివరాలను జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు వివరించి, వారి ఆమోదంతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. తర్వాత కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులకు పథకం అమలుపై అవగాహన తరగతులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: Bihar: పుష్ప సినిమా సీన్.. కానీ ఆయిల్ ట్యాంకర్‌లో..

For Telagana News And Telugu News

Updated Date - Oct 23 , 2024 | 09:37 PM