Share News

Telangana: కాంగ్రెస్ పార్టీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌తో మోసాలు.. చివరికి ఏమైందంటే?

ABN , Publish Date - Jan 23 , 2024 | 09:38 PM

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ ఎదుగుదల కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు పనులకు వాడుతున్నారు. ఆ సాంకేతికతకు తమ ప్రతిభను జోడించి.. అక్రమ మార్గాల్లో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక నిందితుడైతే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి, భారీ మోసాలకు పాల్పడ్డాడు.

Telangana: కాంగ్రెస్ పార్టీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌తో మోసాలు.. చివరికి ఏమైందంటే?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని కొందరు తమ ఎదుగుదల కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు పనులకు వాడుతున్నారు. ఆ సాంకేతికతకు తమ ప్రతిభను జోడించి.. అక్రమ మార్గాల్లో డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక నిందితుడైతే.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి, భారీ మోసాలకు పాల్పడ్డాడు. ఆ వెబ్‌సైట్ ద్వారా డొనేషన్ డబ్బులను వసూలు చేశాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయి, కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..


రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేంద్ర చౌదరి అనే వ్యక్తి కొంతకాలం క్రితం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరిట ‘donateINC.co.in’ అనే నకిలీ డొనేషన్ వెబ్‌సైట్‌ని సృష్టించాడు. దీని ద్వారా అతడు భారీ స్థాయిలో డొనేషన్ డబ్బులను వసూలు చేశాడు. వాట్సాప్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఈ నకిలీ వెబ్‌సైట్‌ని బాగా సర్క్యులేట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే.. దీని గురించి కాంగ్రెస్ నేతలకు తెలిసింది. దీంతో.. వాళ్లు వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ విరాళాల ప్రొఫైల్‌ని సృష్టించి, మోసాలకు పాల్పడుతున్నారని వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత మల్లు రవి సైతం దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నాలజీని ఉపయోగించి.. ఆ నకిలీ వెబ్‌సైట్‌ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న విషయాన్ని పసిగట్టారు. రాజస్థాన్ నుంచి ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. ఫైనల్‌గా నిందితుడు సురేంద్ర చౌదరి ఆచూకీ కనుగొని, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌తో అతడ్ని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇంకా ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2024 | 09:38 PM