Home » Mallu Ravi
కేసీఆర్ ప్రభుత్వం మూసీని బాగు చేయలేదు కాబట్టే తమ ప్రభుత్వం బాగు చేయాల్సి వస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల నియామకాలు, ఫ్రీ బస్ ఇవన్నీ తామే ప్రజలకు ఇస్తున్నామని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వన్నీ చేసి ఉంటే తమ ప్రభుత్వం ఇంకా ప్రాధాన్యత కార్యక్రమాలు చేసే వారమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. తమిళనాడులో కరుణానిధి, జయలలితను విప్లవ నాయకులు అంటారని, ఇకపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలానే పిలవాలని ఎంపీ అభిప్రాయపడ్డారు.
బీసీ సంఘం నాయకుడు, వైసీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మంగళవారం ఆమోదం తెలిపారు.
‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రకటనలు చూస్తుంటే ఆయన పిచ్చి.. పరాకాష్టకు చేరినట్లనిపిస్తోంది.
బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయాక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదని
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు 2021లో సుంకిశాల దగ్గర ఫౌండేషన్ వేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి (Mallu Ravi) తెలిపారు. మేఘ ఇంజినీరింగ్ వర్క్స్‌కి నిర్మాణ పనులు దక్కాయని చెప్పారు. సుంకిశాలకు కర్త, కర్మ, క్రియా మొత్తం కేటీఆరే బాధ్యత అని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు.
‘దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన 10 ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది.. సుప్రీంకోర్టుతో చీవాట్లు తింటూనే.. ఈడీ, సీబీఐ, ఐటీలతో బెదిరించి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.
హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
‘‘అన్ని రకాల అసమానతలతో పోరాడటం ఆయన వ్యక్తిత్వం... వెనుకబడిన వారికి అండగా ఉండాలన్నది ఆయన దృక్పథం... త్యాగం ఆయన వారసత్వం... పోరాటం ఆయన తత్వం... రేపటి కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే ఏకైక నాయకుడు.. రాహుల్‌గాంధీ’’ అని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.