Share News

Tiger Tension: పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో అన్వేషణ

ABN , Publish Date - Dec 02 , 2024 | 08:57 AM

కొమురం భీం జిల్లాలో పెద్దపులి టెన్షన్ కొనసాగుతోంది. రెండు రోజుల్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసింది. పులి జాడ కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు నిర్దారించారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి అధికారులు వెళ్ళ నీయడంలేదు.

Tiger Tension: పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో  అన్వేషణ

కొమురం భీం జిల్లా: పులి జాడ (Tiger Tracks) కోసం కాగజ్ నగర్ అడవుల్లో (Kagaznagar forests) అన్వేషణ (Search) కొనసాగుతోంది. ఇటిక్యాల్ పహాడ్ అటవీ ప్రాంతంలోనే పులి ఉందని అటవీ అధికారులు (Forest Officers) నిర్దారించారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ ల ద్వారా సెర్చింగ్ చేస్తున్నారు. 10 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పులి ప్రభావిత గ్రామాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలు చేశారు. రైతులు, కార్మికులను పంట చేలకు, అటవీ మార్గాల్లోకి అధికారులు వెళ్ళ నీయడంలేదు. పులి నుంచి కాపాడేందుకు మాస్కులు పంపిణీ చేశారు.


పెద్దపులి టెన్షన్

కాగా కొమురం భీం జిల్లాలో పెద్దపులి టెన్షన్ (Big Tiger Tension) కొనసాగుతోంది. రెండు రోజుల్లో పెద్దపులి ఇద్దరిపై దాడి చేసింది. మహిళను (Women) చంపింది. రైతు (Farmer)పై దాడి చేసింది. ఈ ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి అని నిర్దారణ అయింది. అటు పులి కదలికలను గుర్తించడంలో అటవిశాఖ విఫలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దపులి విషయంలో తమను అప్రమత్తం చేయలేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత అధికారులు హడావుడి చేస్తున్నారని అంటున్నారు. అయితే తాము అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు పెద్దపులి కదలికల నేపథ్యంలో కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లోని 15 గ్రామాల్లో (15 Villages) 144 సెక్షన్ (144 Section) కొనసాగుతోంది. అభరాణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి. గ్రామల పొలిమేరలోకి వచ్చి వరుస దాడులు చేస్తూ.. మూగజీవాలు, మనుషులను హతమారుస్తున్నాయి. పులిదాడిలో వ్యవసాయ కూలీ మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు కరువవుతోంది.


జిల్లాలో పెద్దపులి మరోసారి దాడి చేసింది. సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో ఓ రైతుపై పులి దాడికి తెగబడింది. పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. రైతు సురేశ్ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల రైతులు అప్రమత్తమయ్యారు. అంతా కలిసి గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. పులి దాడిలో సురేశ్‌ మెడకు తీవ్రగాయాలు కాగా.. తోటి రైతులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఓ మహిళపై దాడి చేసి చంపిన 24 గంటల వ్యవధిలోనే మరో దాడి జరగడంతో జిల్లావాసులు పులి భయంతో వణికిపోతున్నారు.

కాగా మనుషుల రక్తం మరిగిన పెద్దపులి శుక్రవారం నాడు కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో వ్యవసాయ పనులకు వెళ్లిన మోహిర్లె లక్ష్మి అనే యువతిపై దాడి చేసి చంపేసింది. గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి తోటి మహిళలతో కలిసి పత్తి చేలో పని చేసేందుకు శుక్రవారం ఉదయం నజ్రూల్ నగర్ గ్రామానికి వెళ్లింది. అయితే పత్తి ఏరుతుండగా అక్కడే మాటు వేసిన పులి ఆమెపై ఒక్కసారిగా దాడి చేసింది. మెడ భాగాన్ని కరవడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. దాడిని గమనించిన తోటి కూలీలు కేకలు వేయడంతో పులి అక్కడ్నుంచి పారిపోయింది. బాధితురాలిని గ్రామస్థులంతా కాగజ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకుని అటవీ శాఖ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. అయితే పులి దాడిలో యువతి మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

మరోవైపు కొమురం భీం జిల్లాలో పులి దాడిపై తెలంగాణ అటవీ శాఖ అధికారులు నిన్ననే అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ అమలు చేశారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, సిర్పూర్(టి) మండలంలోనూ పులి దాడి సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి..

ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ

అరకొర వసతులు అద్దె భవనాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 02 , 2024 | 08:57 AM